బాలీవుడ్ నటుడు, సామాజిక సేవకుడు సోనూ సూద్‌కు పంజాబ్‌లోని లూధియానా కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాల్సినప్పటికీ, కోర్టు సమన్లను పలుమార్లు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు ఏమిటి? సోనూ సూద్ ఏం చేశాడు? పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
ఏ కేసులో ఇరుక్కున్నారు సోనూ సూద్?
లూధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనను మోసం చేశారని కోర్టులో కేసు వేశారు. వివరాల ప్రకారం, మోహిత్ శర్మ అనే వ్యక్తి “రిజికా కాయిన్” పేరుతో రూ.10 లక్షల పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని ఆరోపించారు. ఈ లావాదేవీలో సోనూ సూద్ కీలక సాక్షి అని కోర్టు గుర్తించింది. దీంతో ఆయనను కోర్టుకు హాజరుకావాలని పలుమార్లు సమన్లు జారీ చేశారు. అయితే ఆయన స్పందించకపోవడంతో కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.
అరెస్ట్ వారెంట్ జారీ: ముంబై పోలీసులకు ఆదేశాలు
లూధియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమణ్‌ప్రీత్ కౌర్ సోనూ సూద్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ముంబైలోని ఒషివారా పోలీస్ స్టేషన్‌కు ఈ వారెంట్ చేరింది. సోనూ సూద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలనీ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరగనుంది. సోనూ సూద్ పలుమార్లు సమన్లను పట్టించుకోకపోవడం కోర్టు ఆగ్రహానికి కారణమైంది. అతను విచారణకు హాజరు కాకుంటే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.
సోనూ సూద్ రియాక్షన్?
ఇప్పటివరకు సోనూ సూద్ లేదా ఆయన న్యాయవాదుల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఫిబ్రవరి 10న కోర్టులో హాజరు కాకపోతే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సోనూ సూద్ సినిమాల్లో విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా మారారు. అయితే తాజా కేసు ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసు ఏవిధంగా పరిష్కారం అవుతుందో చూడాలి. ఫిబ్రవరి 10 కీలకంగా మారనుంది!