అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న వైష్ణవ్ తేజ్ కొండపొలం

Konda Polam streaming on this OTT platform, Konda Polam streaming on this OTT platform now, Kondapolam, Kondapolam Telugu Movie, Kondapolam Telugu Movie Streaming On Amazon Prime, Mango News, Vaishnav Tej Konda Polam, Vaishnav Tej’s Kondapolam streaming now on OTT, Vaishnav Tej’s Kondapolam streaming OTT, Vaisshnav Tej, Vaisshnav Tej Kondapolam Telugu Movie, Vaisshnav Tej Kondapolam Telugu Movie Streaming On Amazon, Vaisshnav Tej Kondapolam Telugu Movie Streaming On Amazon Prime, Vaisshnav Tej Movies

దసరా కానుకగా మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన కొండపొలం సినిమా అక్టోబర్ 8న విడుదల అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు మరియు రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు. ఫీల్ గుడ్ మూవీగా ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. అగ్ర సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించటం విశేషం. హీరో వైష్ణవ్ తేజ్ “ఉప్పెన” తర్వాత చేసిన సినిమా ఇదే. ఇందులో వైష్ణవ్ చదువుకున్న గిరిజన యువకుడిగా నటించటం విశేషం.

కరోనా పరిస్థితుల ప్రభావంగా కొన్ని నెలలుగా సినిమాలు థియేటర్లలో విడుదల కావటంలేదు. ఇప్పటికే కరోనా కారణంగా దేశంలో రెండుసార్లు లాక్ డౌన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో సినిమాలు థియేటర్లలో విడుదల అయినా సరైన ప్రేక్షకాదరణ లేక ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి లేదు. అందుకే, నిర్మాతలు థియేటర్లలో విడుదల చేసినా కూడా ఎక్కువ వ్యవధి లేకుండా వెంటనే ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు మూవీని ఇక్కడ వీక్షించగలరు: 👇

“కొండపొలం”

సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇంజినీరింగ్ చదువుకున్న ఓ గిరిజన యువకుడు ఉద్యోగ ప్రయత్నాలలో విఫలమవడం, తిరిగి అడవిలోకి వెళ్లి కొండపొలం చేయటం (గొర్రెలను కాయటం), పిరికివాడుగా ఉండే అతను తనను తాను ఎలా మార్చుకున్నాడు? ఎలా పరిణతి సాధించాడు? అనే విషయాలను స్పృశిస్తూ సాగుతుంది ఈ చిత్రం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, వైవిధ్య కథనం, వైష్ణవ్ తేజ్ నటన అన్నీ కలిపి సినిమాను విజయవంతం చేసాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here