గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా `గేమ్ ఛేంజర్`. ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ‘రా మచ్చా మచ్చా’ పాటను విడుదల చేశారు. ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాస్ స్టెప్పులతో ఆయన చేసి డ్యాన్స్ అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. రామ్ చరణ్ హెలికాఫ్టర్ నుంచి దిగే సీన్ నుంచి చివరి షాట్ వరకు ప్రేక్షకులను అబ్బుర పరిచారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టెప్స్ వారెవ్వా అనిపించాయి. రామ్ చరణ్ గ్రేస్ ఊపు తెచ్చింది. చిరంజీవి కటౌట్ ముందుకు రామ్ చరణ్ వీణ స్టెప్స్ వేసి అడియన్స్‌లో జోష్ నింపారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట చెర్రీ అభిమానులను అలరిస్తోంది.
కాగా స్టార్ హిరోయిన్ సమంతా ‘రా మచ్చా మచ్చా’ పాటకు ఫిదా అయ్యారు. చెర్రీ ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్ అన్ మ్యాచబుల్ అంటూ ప్రంశసించింది. రామ్ చరణ్ షేర్ చేసిన ఈ సాంగ్ కు ఆయన సతీమణి ఉపాసన కామెంట్ పెట్టింది. మిస్టర్ చరణ్ నువ్వు హై ఓల్టేజ్ ఎలక్ట్రిసిటీని జెనరేట్ చేశావ్ అని రాసుకు వచ్చింది. ఈ కామెంట్ కు సమంత రిప్లై ఇచ్చింది. అన్ మ్యాచబుల్ అని కామెంట్ పెట్టింది. ఫార్మల్ షర్ట్, ప్యాంట్ లో మరెవ్వరూ ఆయనలా డ్యాన్స్ చేయలేరు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరి సమంత చరణ్ తో రంగస్థలం ఇండస్ట్రీ హిట్ ని చేసిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి చరణ్ తో సామ్ కి పరిచయం బాగా ఏర్పడింది. అయితే చరణ్ విషయంలో ఆమె చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. నేనేమంటున్నా అంటే ఒక హీరో ఇలా ఫార్మల్ షర్ట్, పాంట్స్ లో ఈ రేంజ్ లో డాన్స్ చెయ్యడం అనేది అంత సులభం కాదు అంటూ మరిన్ని ఫైర్ సింబల్స్ పెట్టి చరణ్ విషయంలో సమంత ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయ్యింది. అయితే చరణ్ విషయంలో సమంత ఇంతలా ఎగ్జైట్ అవ్వడం అనేది ఇదే తొలిసారి కూడా కాదు. గతంలో కూడా మన టాలీవుడ్ హీరోస్ లో బెస్ట్ బాడీ ఎవరికైనా ఉంది అంటే అది చరణ్ కే అని చరణ్ తన బాడీని అద్భుతంగా మారుస్తూ స్టన్నింగ్ ఫిట్నెస్ మైంటైన్ చేస్తాడని కూడా తెలిపింది. కాగా ఇప్పుడు మళ్ళీ సామ్ చరణ్ విషయంలో మరోసారి ఎగ్జైట్ అయ్యిందని చెప్పాలి. వీటితో చరణ్ పట్ల మిగతా మెగా హీరోస్ కంటే సామ్ దృష్టిలో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందనే అనుకోవచ్చు.