ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్‌తో పాటు ఒకే వేదిక పంచుకోనున్న టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్‌

Tollywood Actor Ram Charan To Share Stage With PM Modi and Sachin Tendulkar in Delhi,Tollywood Actor Ram Charan With PM Modi,Actor Ram Charan Share Stage with Sachin Tendulkar,PM Modi and Sachin Tendulkar in Delhi,Mango News,Mango News Telugu,News That Will Give a Kick To Mega Fans,Ram Charan To Share Stage with PM Modi,Ram Charan To Speak At India Today,PM Modi and Sachin Tendulkar Latest News,Tollywood Actor Ram Charan Latest News,Indian Prime Minister Narendra Modi,PM Modi News Today,Sachin Tendulkar Latest News,Actor Ram Charan Live News

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ [ప్రముఖ నటుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఛానల్ ఇండియా టుడే ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఒక సదస్సులో పాల్గొనడానికి రామ్‌చరణ్‌కు ఆహ్వానం అందింది. శుక్రవారం రాత్రికి జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్‌ సహా రామ్‌చరణ్‌ ప్రసంగించనున్నారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్‌ ప్రత్యేకంగా ప్రధాని మోదీని కలువనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటలో చక్కని అభినయం ప్రదర్శించింనందుకు ఆయనను ప్రధాని సత్కరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రామ్‌చరణ్‌, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన సతీమణి ఉపాసనతో కలిసి ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here