నయనతారకు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా దనుష్, నయన్ ఇష్యూ

Court Issues Strong Warning To Nayanthara Dhanush Nayan Issue A Hot Topic In The Film Industry, Hot Topic In The Film Industry, Court Issues Strong Warning To Nayanthara and Dhanush, Strong Warning To Nayanthara, Court Issues Strong Warning To Nayanthara, Dhanush, Film Industry, Hot Topic, Nayan Issue, Dhanush Nayanathara Issue, Stars Support To Dhanush Nayanathara, Nayanathara Issue, Dhanush Issue, Dhanush, Nayanthara, We Stand With Dhanush, Movie News, Movie Updates, Celabs News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

సౌత్‌ ఫిలిం ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతారకు షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. ఇటీవల కొన్ని వివాదాలు ఆమెను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. వాటిలో ధనుష్‌తో ఏర్పడిన వివాదం తారాస్థాయికి చేరుకుంటోంది. తన పెళ్లి విజువల్స్‌తో కూడిన ఓ డాక్యుమెంటరీలో ధనుష్‌ నిర్మించిన నాన్‌ రౌడీ దాన్‌ చిత్రంలోని వీడియో క్లిప్‌ను ఉపయోగించడంతో ఈ వివాదం మొదలైంది. నయన్‌పై పదికోట్లకు దావా వేస్తూ కోర్టుకెక్కాడు ధనుష్‌. ఈ వివాదంపై కోర్టులో విచారణకు రాగా….నయనతారకు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నయనతారను మందలించారు. ధనుష్‌ నిర్మించిన సినిమాకి సంబంధించిన క్లిప్స్‌ వాడుకోవాలంటే అతని అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జనవరి 8లోగా దీనిపై సమాధానం చెప్పాలని నయనతారను కోరింది.

అంతకుముందే ధనుష్‌, నయనతార మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. నానుమ్‌ రౌడీ ధాన్‌ సినిమాను నయన్‌ భర్త విఘ్నేష్‌ డైరెక్ట్‌ చేశారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో తనను చాలా ఇబ్బంది పెట్టారంటూ విఘ్నేష్‌, నయనతారలపై ధనుష్‌ ఆరోపణలు చేశాడు. ఇదే క్రమంలో తను చేస్తున్న డాక్యుమెంటరీలో ఆ చిత్రంలోని వీడియో క్లిప్‌ను వాడుకుంటానని, దానికి అనుమతి కావాలని కోరింది నయన్‌. కానీ, దానికి ధనుష్‌ అంగీకరించలేదు. అయినా అందులోని క్లిప్‌ను డాక్యుమెంటరీకి వాడారు. దీంతో పదికోట్లు చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించారు ధనుష్‌.

కోర్టులో ధనుష్‌కు అనుకూలంగా తీర్పు వస్తే.. అతను డిమాండ్‌ చేసిన మొత్తాన్ని నయనతార చెల్లిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. లేక ఇద్దరికీ రాజీ కుదిర్చి సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి ఇద్దరి మధ్య వివాదం తమిళ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.