
అనంతపురంలో ఈరోజు జరగాల్సిన డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయింది. బుధవారం(జనవరి 8) రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన మూవీ వేడుకను బాలకృష్ణ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని డాకు మహరాజ్ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అనంతపురంలో ఈరోజు (జనవరి 9) సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా నారా లోకేష్ హాజరుకానున్నట్లు కూడా గతంలోనే చిత్రయూనిట్ తెలియజేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న సినిమా డాకు మహరాజ్. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఇప్పటికే బాలయ్య అభిమానులను ఆకట్టుకుంది.కాగా.. కొద్దిరోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
దీనిలో భాగంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే రాయలసీమ గడ్డపై ముఖ్యంగా అనంతరంలో ఈరోజు సాయంత్రం డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని మేకర్స్ అనుకున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.
అయితే బుధవారం రాత్రి వేరు వేరు చోట్ల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించారు. దీంతో తిరుపతి ఘటన వల్ల డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నామని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లే తిరుపతి క్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని..అందుకే మా వేడుకను నిర్వహించుకోవడానికి ఇది సరైన తరుణం కాదని భావిస్తున్నామని చెప్పారు. భక్తులను, వారి మనోభావాలను గౌరవిస్తున్నామని.. అందుకే మా వేడుకను రద్దు చేసుకుంటున్నామని.. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాంటూ మేకర్స్ ప్రకటించారు.