ఎన్ని విమర్శలు వచ్చినా.. బిగ్ బాస్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. దీంతో చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ బుల్లితెరమీద ఎంట్రీ ఇచ్చేశాడు. తాజాగా సెప్టెంబర్ 1 నుంచి..తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఎవరి అంచనాలకు అందని విధంగా కొత్త సీజన్ మొదలైంది. పాత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని ఇప్పటికే వచ్చిన ప్రోమోలను చూస్తేనే అందరికీ అర్థం అయింది.
దానికి తగినట్లుగానే మొదటి రోజే ట్విస్ట్‌లతో బిగ్‌బాస్ సీజన్ ఎంట్రీ అద్దిరిపోయింది. కంటెస్టెంట్లను సింగిల్‌గా కాకుండా జంటలుగా పంపించి కొత్తదనానికి బిగ్‌బాస్ నాంది పలికాడు. అలాగే బిగ్‌బాస్ 8వ సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండానే షో కొనసాగుతుందని చెప్పి కంటెస్టంట్లకే కాదు ఆడియన్స్ కూ కూడా బిగ్‌బాస్ పెద్ద షాకిచ్చాడు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా తొలిరోజే బిగ్‌బాస్‌లో ఫైటింగ్ మొదలైనట్టు ప్రోమోలో తెలుస్తోంది.
తాజాగా చూపించిన ప్రోమోలో నిఖిల్, నాగ మణికంఠల మధ్య గొడవ జరిగినట్టు చూపించారు. నాగ మణికంఠ మాట్లాడుతూ నీ వల్ల ఇష్యూ పెద్దది అవుతుందని చెబుతుండగా, నా వల్ల అయితే దానిని వదిలేయ్ అంటూ నిఖిల్ చెప్పడం ప్రోమోలో చూపించారు.ప్రోమో చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టే కనిపిస్తోంది. దీంతో తొలిరోజు నుంచే బిగ్‌బాస్ తన గేమ్ మొదలుపెట్టారన్న క్యూరియాసిటీని పెంచేసారు. ఇక ఎప్పటిలాగే టీవీ సీరియల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కంటెస్టెంట్లను చూస్తేనే అర్థం అయింది.
బిగబాస్ సీజన్ 8.. మొదటి కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ యష్మీ గౌడ ఎంట్రీ ఇచ్చారు. సీరియల్ యాక్టర్ నిఖిల్ రెండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. మూడో కంటెస్టెంట్‌గా కమెడియన్ అభియ్ నవీన్ ఎంట్రీ ఇవ్వగా.. నాలుగో కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ ప్రేరణ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు. ఐదో కంటెస్టెంట్‌గా ”లాహిరి లాహిరి లాహిరీలో” సినిమా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు.
ఆరో కంటెస్టెంట్‌గా నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. సోనియా ఆకులకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా బిగ్‌బాస్‌లో ప్లే చేశారు. ఏడో కంటెస్టెంట్‌గా ప్రముఖ యూట్యూబర్, యాక్టర్ బెజవాడ బేబక్క అడుగుపెట్టిందది.
ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఆర్‌జే శేఖర్ భాషా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టగా…తొమ్మిదో కంటెస్టెంట్‌గా 7ఆర్ట్స్ సీత బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చింది . అలాగే పదో కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ నాగ మణికంఠ అడుగుపెట్టాడు. పదకొండో కంటెస్టెంట్‌గా పృద్వీరాజ్ ,పన్నెండో కంటెస్టెంట్‌గా ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ అడుగుపెట్టారు. 13వ కంటెస్టెంట్‌గా హౌస్‌లో డాన్సర్ నైనిక ఎంట్రీ ఇవ్వగా..14వ కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ నబీల్ అఫ్రిది హౌస్‌లో అడుగుపెట్టారు. మొత్తంగా తాజాగా విడుదలైన ప్రోమోతో షోపై అంచనాలు రెట్టింపు అయ్యాయంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.