గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ ట్రైలర్ గురువారం సాయంత్రం రిలీజై.. సోషల్ మీడియా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఎలాంటి ట్రైలర్ పడితే రికార్డ్స్ బ్లాస్ట్ అవుతాయో, అలాంటి ట్రైలర్ ఇది అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదంటూ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.
అయితే టీజర్ కి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ, ఎందుకో అందులో శంకర్ మార్క్ కనిపించలేదని కొంతమంది సోషల్ మీడియా లో కామెంట్లు చేశారు. కానీ ట్రైలర్ మాత్రం విమర్శలకుల చేత కూడా ప్రశంసలు అందుకుంటూ రికార్డ్స్ దిశగా పరుగులు పెడుతుంది. వింటేజ్ శంకర్ మార్క్ మూవీని చూసి చాలా కాలం అయిందని.. ట్రైలర్ ని చూస్తుంటే శంకర్ కెరీర్ లో మరో బెస్ట్ మూవీ రాబోతున్నట్టు అనిపిస్తుందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా యూట్యూబ్లో ఈ ట్రైలర్ విడుదలైన 3 గంటల్లోనే నాలుగు లక్షల లైక్స్, 12 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అయితే పబ్లిక్ గా కేవలం నాలుగు మిలియన్ల వ్యూస్ మాత్రమే అప్డేట్ అయ్యాయని.. ట్రాఫిక్ భారీగా ఉన్నప్పుడు వ్యూస్ అంత తొందరగా అప్డేట్ అవ్వవని నిపుణులు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ట్రైలర్ కి 24 గంటల్లో ఆరు లక్షల లైక్స్ వచ్చాయి. ‘గేమ్ చేంజర్’ ఆ లైక్స్ కౌంట్ ని ఇంకా ముందే దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఎన్ని పాన్ ఇండియన్ సినిమాలు ఇప్పటి వరకూ రిలీజ్ అయినా పవన్ కళ్యాణ్ రికార్డుని బ్రేక్ చేయలేకపోతున్నారు. పవన్ నటించిన భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ కి కేవలం మూడు నిమిషాల్లోనే లక్ష లైక్స్ వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రభాస్ ‘సలార్’ మూవీ నిలబడగా, మూడవ స్థానంలో మళ్లీ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమానే ట్రైలరే నిల్చింది. ప్ర
స్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ 24 గంటల్లో 7 లక్షల లైక్స్ని అందుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ కి 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 24 గంటల్లో 1 మిలియన్ కి పైగా లైక్స్‌ను సొంతం చేసుకున్న భీమ్లా నాయక్, సలార్, వకీల్ సాబ్ , ట్రిపుల్ ఆర్ మూవీ రికార్డ్స్ ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.