రోహిత్ శర్మ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరో..!

Junior NTR Is The Hero In Rohit Sharma'S Biopic,Rohit Sharma'S Biopic,Junior NTR Is The Hero,Biopic,NTR,Rohit Sharma,NTR in Rohit Sharma'S Biopic,NTR Is The Hero In Rohit Sharma'S Biopic, Hitman Rohit, Junior NTR,Live Updates, Politics, Political News,Mango News,Mango News Telugu
Junior NTR, Rohit Sharma's biopic, hitman rohit

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు మన దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ, సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ మరియు వల్డ్ కప్ విన్నింగ్ టీమ్ 83 సినిమాలు కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. క్రికెట్‌ను బేస్ చేసుకుని ఎన్నో సినిమాలు తెరకెక్కి విజయం సాధించాయి. ఇప్పుడు ఈ సీరీస్‌కి మరో సినిమా రావాలని సోషల్ మీడియాలో డిమాండ్ మొదలైంది. 2024 ఐసీసీ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు ట్రోఫీని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ జీవితం ఆధారంగా టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించనున్నాడని… రోహిత్ శర్మ సినిమాకు ‘ది హిట్ మ్యాన్’ అని పేరు పెట్టాలని సూచిస్తూ ఓ అభిమాని వేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది.

T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ తన T20I కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు మరియు ప్రస్తుతం భారత జట్టు నుండి విరామం తీసుకుని వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. జూలై 14 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్స్ చూసేందుకు లండన్ వెళ్లిన 37 ఏళ్ల వెటరన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ సెంటర్ కోర్ట్ లో సూట్ బూట్‌లు ధరించి కెమెరాకు ఫోజులిచ్చాడు. అయితే ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరియు రోహిత్ శర్మల మధ్య ఉన్న పోలికను గుర్తించిన అభిమాని ‘ది హిట్‌మ్యాన్’ పోస్టర్‌ను రూపొందించి, రోహిత్ శర్మ బయోపిక్‌కు జూనియర్ ఎన్టీఆర్ సరైన ఎంపిక అని చర్చకు దారితీసింది. ఐతే ఇండియన్ క్రికెట్ చూసిన గొప్ప ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన రోహిత్ శర్మ బయోపిక్ బయటకు వస్తే, అది కచ్చితంగా థియేటర్లలో హిట్ అవుతుంది. హిట్‌మ్యాన్ కు ఉన్న అభిమానులను ఈ సినిమాను చూస్తారనడంలో సందేహం లేదు.

ఇప్పటికే సోషల్ మీడియాలో రోహిత్ బయో పిచ్ పై విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఎవరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సమీప భవిష్యత్తులో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి ఈ పోస్టర్ నిజమవ్వాలని హిట్ మాన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మకు ఈ సందర్భంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఆడాలనే కోరిక ఇంకా ఉంది. అభిమానులు ఇప్పటికీ తన ఆటను ఆస్వాదిస్తారని చెప్పుకొచ్చాడు. 2024లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత రోహిత్ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF