ప్రతి ఇండస్ట్రీల్లో మహిళలపై వేధింపులు సంబంధించిన వార్తలు ఎప్పుడో ఒకసారి బయటకు వస్తూనే ఉన్నాయి. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ సైతం తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చారు.
ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..మల్లిక శెరావత్. ఒకప్పుడు బాలీవుడ్‌లో మల్లిక శెరావత్‌కు సూపర్ క్రేజ్ ఉండేది. ఈ క్రమంలోనే కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. ఇండస్ట్రీలో తనకు ఒకటి రెండు కాదు.. ఎన్నో సమస్యలు వచ్చాయని తెలిపింది. సినీరంగంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడింది. సినిమా షూటింగ్ కోసం మల్లిక దేశ, విదేశాలకు వెళ్లేది.
అయితే ఓ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందంతో కలిసి దుబాయ్ వెళ్లింది మల్లికా. భారీ బడ్జెట్ మూవీ కావడంతో కొద్ది రోజులు అక్కడే ఉన్నానని.. ఆ సమయంలో ఓ స్టార్ హీరో తనను వేధించాడని చెప్పుకొచ్చింది. “నేను దుబాయ్‌లో ఓ పెద్ద సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. ఈ మూవీలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనాలు మంచిగా ఆదరించారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందులో నేను కామెడీ రోల్ చేశాను. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఆ సినిమా హీరో అర్ధరాత్రి వచ్చి నా గది తలుపు తట్టాడు. అతడు తలుపు బద్దలు కొడతాడేమోనని భయపడ్డాను. గట్టిగా తలుపులు తలుపు కొట్టేవాడు. అతడు నా గదికి రాకూడదని అనుకున్నాను. ఆ ఘటన తర్వాత మళ్లీ ఆ హీరోతో కలిసి పనిచేయలేదు” అంటూ చెప్పుకొచ్చింది.
మల్లిక శెరవత్ ఈ తరానికి పెద్దగ తెలియకపోవచ్చు కానీ..2000ల్లో యూత్‌కు మల్లిక శెరావత్ ఓ శృంగార దేవతే అని చెప్పాలి. కొత్తతరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో మల్లిక శెరావత్ రేసులో వెనుకపడ్డారు. దీంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా మల్లిక శెరావత్, ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. తాజాగా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ అనే సినిమాలో నటించరామె. త్రిప్తి డిమ్రీ, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మల్లిక శెరావత్ సినిమా విషయాలతో పాటు, తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.