రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మూవీ మేకర్స్ దీపావళి సందర్భంగా అదిరిపోయే పోస్టర్ బయటకు వదిలారు. టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ గమనిస్తే రైల్వే ట్రాక్‌పై కూలింగ్ గ్లాస్ పెట్టుకుని లుంగీ, బనియన్‌తో పక్కా మాస్ లుక్‌లో కూర్చున్న రామ్ చరణ్‌ను చూడొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ లుక్ ఉన్న పోస్టర్‌ను పోస్ట్ చేసి గేమ్ చేంజర్‌లో ట్రైన్ ఫైట్ ఉండబోతుందని, ఆ ఫైట్ అందరి అంచనాలను మించేలా ఉంటుందని చెప్పటంతో అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి.
ఇక గేమ్ ఛేంజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మూవీ యూనిట్ యాక్టివ్ అయి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అవ్వగా అవి వైరల్ అయ్యాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ రేంజిలో హంగామా చేసి రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో కానీ ప్రస్తుతానికి మాత్రం రిలీజ్ డేట్స్ మార్చుకునే సిట్యువేషన్ పరిస్దితి తీసుకువస్తోంది.
కేవలం తెలుగులో సినిమాలు మాత్రమే గేమ్ ఛేంజర్ దెబ్బకు ప్రక్కకు తప్పుకోవటమే కాకుండా తమిళ సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ ని విడుదల షెడ్యూల్‌లను పునఃపరిశీలించవలసి ఉంటోందని వార్తలు వస్తోంది. అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ…రామ్ చరణ్, శంకర్ కొలాబిరేషన్ అంటే ఖచ్చితంగా మార్కెట్ ని గ్రాబ్ చేసే వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ టైమ్ లో ఆ సినిమాతో పోటీపడితే రెవిన్యూలు తగ్గుతాయని తమిళ స్టార్స్ కు తెలుసు. అందుకే వెనక్కి తగ్గి దారి ఇస్తున్నారు అన్నారు.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతికి ప్లాన్ చేసారు. కానీ దాన్ని ఇప్పుడు ఏప్రియల్ లేదా మే కు మారే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇక విక్రమ్ నటించిన వీర ధీర శూర చిత్రం కూడా సోలో రిలీజ్ కోసం పోటీ నుంచి తప్పుకుంటోందని తెలుస్తోంది. ఇలా చిన్నా, పెద్ద సినిమాలు అన్ని శంకర్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు దారి ఇచ్చి తప్పుకుంటున్నాయి.
దీపావళికి వచ్చే టీజర్ తో సినిమాకు క్రేజ్ రెట్టింపు అవుతోందని భావిస్తున్నారు. టీజర్ బాగా రిసీవ్ చేసుకుంటే ఎక్సపెక్టేషన్స్ పెరిగి, బిజినెస్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే ప్రమోషన్స్ బాగా చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.