హనుమంతుడిగా చిరంజీవా? రానా దగ్గుబాటా..?

Chiranjeevi As Hanuman Or Rana Daggubati, Chiranjeevi As Hanuman, Rana Daggubati As Hanuman, Jai Hanuman, Jai Hanuman Pre Production Work Has Started, Chiranjeevi, Rana Daggubati, Latest Hanuman Movie News, Hanuman Movie News Update, Hanuman Movie Sequel, Latest Tollywood News, Telugu Movies, Telangana, Film News, Mango News, Mango News
Jai HanuMan ,Jai Hanuman pre-production work has started, Chiranjeevi as Hanuman, Rana Daggubati as Hanuman,

టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. భారతదేశంలో కొలిచే దేవుళ్లని సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ.. డైరక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీతో ఒక సినిమా యూనివర్స్‌నే క్రియేట్ చేశాడు. అంతేకాదు ఆ సినిమా ఎండింగ్‌లో దీనికి  సీక్వెల్ ఉందని  ప్రకటించి ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచేశాడు. దీనికితోడు హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో.. ఆడియన్స్ అంతా ‘జై హనుమాన్’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక జనవరి 22న యావత్ దేశం ఎదురుచూసిన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా రామనామ జపం జరగడంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇలాంటి శుభదినాన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ మూవీ పనులు మొదలు పెట్టేశాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ని.. ఈ మహత్తరమైన రోజునే ప్రారంభిస్తున్నామంటూ సోమవారం ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు.  ఈ అనౌన్స్‌మెంట్‌తో హనుమాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు

అయితే ఈ మూవీ చివరలో చూపించినట్లుగా రామునికి హనుమంతుడి ఇచ్చిన మాటేంటి అన్న కథాంశం మీదే సినిమా ఉంటుందట. మొత్తంగా ఈ మూవీ కథ అంతా హనుమాన్ పాత్ర చుట్టూనే తిరుగుతుందట. హనుమాన్ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోబోతున్నట్లు తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పడంతో మరోసారి ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకే మూవీ మొదటి పార్ట్  అయిన హనుమన్‌లో హనుమంతుడి ఫేస్ ని తాము రివీల్ చేయలేదని చెప్పాడు.  అయితే ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరన్నది ప్రశాంతవర్మ చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో వివిధ ఊహాగానాలతో నిండిపోయింది.

మరోవైపు ఈ మూవీలో  రాముడి పాత్రలో రామ్ చరణ్.. కనిపించబోతున్నాడంటూ ఈ మధ్య గట్టిగా వార్తలు వినిపించాయి.అంతేకాదు హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు హనుమంతుడి కళ్లను చూసిన వారంతా చిరంజీవి అని గెస్ చేశారు. కానీ సినిమాలో హనుమంతుడి ఫేస్ రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేశాడు ప్రశాంత్ వర్మ. దీంతో మరోసారి హనుమంతుడిగా చిరంజీవి కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.మరికొంతమంది మాత్రం ఫేస్ సైడ్ కటవుట్ చూసి హనుమంతుడు చిరంజీవి కాదు రానా దగ్గుబాటి అంటున్నారు. మరి జై హనుమాన్‌లో  హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారో చూడాలంటే కొద్ది నెలలు వెయిట్ చేయాల్సిందే.  ఈ సీక్వెల్‌లో తేజ సజ్జ..హనుమాన్ మూవీలో ఉన్నట్లే హనుమంతు పాత్రతోనే సపోర్టింగ్ రోల్‌లోనే మ కనిపిస్తాడు. హనుమాన్ సీక్వెల్ 2025 లో ఆడియన్స్ ముందుకు రాబోతుందన్న విషయం ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eleven =