ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరువ అవుతున్న నేపథ్యంలో నెటిజన్స్ వికృతి చేష్టలు వీరిని మరింత ఇబ్బంది పెడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు తమకు మనశ్శాంతి లేకుండా పోతోందని వాపోతున్నారు. సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు.. అయితే ఈ రెండింటిని ముడి పెడుతూ సెలబ్రిటీలను కొంతమంది ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారు.
హిరోయిన్ ప్రియమణి వ్యక్తిగత జీవితంపై కూడా ఈ మధ్య ఇలాంటి విపరీతమైన ట్రోలింగ్ జరుగుతంది. ప్రియమణి 2016లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ప్రియమణి ముస్తఫా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరి మతాలు వేరేవి కావడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్లు ప్రియమణిని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై ప్రియమణి రియాక్ట్ అయ్యారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి.. తనపై ఎలాంటి ట్రోలింగ్ జరిగింది అనే విషయంపై కామెంట్ చేసింది. 2016లో మా నిశ్చితార్థం అయినప్పటి నుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపారు. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తప్పుడబుతూ పలువురు నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్కోసారి ఈ విమర్శలను చూస్తే చాలా బాధ అనిపిస్తోంది. కులమతాలకతీతంగా పెళ్లి చేసుకున్న స్టార్లు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. మా ఇష్టాయిష్టాలు కలవడం వల్లే పెద్దలను ఒప్పించి మేము వివాహం చేసుకున్నాము. కానీ, ఈ విషయంలో నన్నే ఎక్కువగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం దారుణమని ప్రియమణి వాపోయారు.
వేరే మతానికి చెందిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానని ట్రోల్ చేశారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు. అయితే కొన్నిసార్లు వాటిని అంతగా పట్టించుకోను. కానీ వాళ్ళ మాటల వల్ల ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటాను.. కుల మతాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న స్టార్లు చాలామంది ఉన్నారు కదా.. అయితే ఈ విషయంలో నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఎమోషనల్ అయింది ప్రియమణి. ప్రేమకు మతం, కులం అడ్డు కాదని ఆమె పదేపదే చెబుతూ వస్తున్నారు.
హీరోయిన్ ప్రియమణి గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన అవసరం లేదు. జగపతి బాబు నటించిన ‘పెళ్లైన కొత్త’లో సినిమాతో హీరోయిన్‌గా పరిచియమైన ప్రియమణి, తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘యమదొంగ’ సినిమాతో మరో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు, నితిన్ , గోపిచంద్ వంటి యంగ్ హీరోల సరసన కూడా నటించి మెప్పించారు.
తెలుగుతో పాటు , తమిళ, కన్నడ, మళయాళం మరియు హిందీ సినిమాల్లో నటించి, దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రముఖ నటిగా ప్రియమణి నిలిచారు. “పరుత్తివీరన్” అనే తమిళ సినిమాలో ఆమె నటనకుగాను ప్రియమణికి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చిన ప్రియమణి, ఢీ షోలో జడ్జీగా ఆకట్టుకున్నారు. ఢీ షోలో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా కాని అభిమాని ఉండరంటే అతిశేయోక్తి కాదు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ప్రియమణి ఆకట్టుకుంటున్నారు.