హైదరాబాద్‌ టీమ్‌ కొనుగోలు చేసిన చెర్రీ

Ram Charans Entry Into The Cricket Field, Ram Charans Entry, Cricket Field, Entry Into The Cricket,ISPL,Ram Charans Entry Cricket Field,Charan Bought By The Hyderabad Team, Ram Charan, Latest Cricker News, Cricket Updates, Indian Cricket, India, Hyderabad, Mango News, Mango News Telugu
ISPL,Ram Charan's entry cricket field,Charan bought by the Hyderabad team

ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వేరే ఏ ఇతర ఆటకు ఉండదంటే అతి శయోక్తి కాదన్న విషయం తెలిసిందే. అందుకే టీమిండియా మ్యాచ్‌ ఉందంటే  చాలు అభిమానులు ఆ మ్యాచ్ అయ్యేవరకూ అన్నం, నీళ్లు కూడా పక్కన  పెట్టేవాళ్లు కూడా ఉన్నారు.

అందులోనూ భారత్‌లో ఐపీఎల్‌ మ్యాచులకున్న క్రేజే వేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఒక్కటే కాదు..దీంతో పాటు ఉమెన్స్‌ ప్రీమియర్ లీగ్‌ అన్నా కూడా క్రికెట్‌ అభిమానులకు పండుగే. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కొత్త కాన్సెప్ట్‌తో  వచ్చే ఏడాది గల్లీ క్రికెటర్ల కోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్  ప్రారంభం కానుందన్న వార్త ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ పెంచేసింది.

గల్లీల్లో ఉండే క్రికెట్‌  టాలెంట్‌ను వెతికి మరీ ఇక్కడకు తీసుకొచ్చే వేదికగా  స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఉండబోతోంది. ఇండియాలో ఉన్న క్రేజ్‌తోనే చాలా మంది సెలబ్రెటీలు కూడా క్రికెట్ టీమ్‌లపై ఆసక్తి చూపించడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్‌ బచ్చన్‌ ముంబై జట్టును కొనుగోలు చేయగా..హృతిక్ రోషన్ బెంగళూరు, అక్షయ్ కుమార్ శ్రీనగర్ జట్లను కొన్నారు. తాజాగా ఈ లిస్టులోకి  టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ కూడా చేరిపోయారు. ఈ గ్లోబల్ స్టార్‌ తాజాగా హైదరాబాద్‌ టీమ్‌ను కొనుగోలు చేశారు.

ఇండియాలో సరికొత్తగా ఎంట్రీ ఇస్తున్న గల్లీ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా.. హైదరాబాద్‌ క్రికెట్ టీమ్‌ను కొన్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ దీని గురించి ఎక్స్‌ ప్లాట్‌ఫామ్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. గల్లీ క్రికెట్‌ లీగ్‌ హైదరాబాద్‌ టీమ్‌కు ఓనర్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెర్రీ చెప్పుకొచ్చారు. ఐఎస్‌పీఎల్‌లో హైదరాబాద్‌ జట్టు జైత్రయాత్ర కోసం, అందమైన జ్ఞాపకాల్ని పోగు చేసుకోవడానికి నాతో చేతులు కలపండని చరణ్‌  తన పోస్టులో రాసుకొచ్చారు.

2024 ఏడాది మార్చి నుంచి గల్లీ క్రికెట్ లీగ్‌ మొదలు అవుతుంది.  భారత్‌లో గల్లీ క్రికెట్ ఆడే టెన్నిస్‌ బాల్‌ను ఈ మ్యాచుల్లో ఉపయోగిస్తారు.ఐపీఎల్ లాగే ఫ్రాంచైజీలు గల్లీ క్రికెట్  లీగ్‌లో తమతమ ఆటగాళ్లను బరిలోకి దింపుతాయి. టీ 10 ఫార్మాట్‌లోనే  గల్లీ క్రికెట్ లీగ్‌ కూడా జరుగుతుంది.

మొత్తం ఆరు జట్లు ఈ లీగ్‌లో తలపడనుండగా… ఇందులో ఆరు జట్లు ఏడు రోజుల పాటు 19 మ్యాచ్‌లు ఆడనున్నాయి. హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, శ్రీనగర్ ఫ్రాంచైజీలు ఈ గల్లీ క్రికెట్ లీగ్‌లో తలపడనున్నాయి.  ముంబై వేదికగా ఫిబ్రవరి 24న  ఐఎస్‌పీఎల్ వేలం ఉండనుంది. ఒక్కో జట్టుకు  కోటి రూపాయలు పర్స్‌ వాల్యూ ఉంటుంది. ఒక్క ఆటగాడి కొనుగోలుకు అత్యధిక నగదు రూ.3లక్షలుగా ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 1 =