పుష్ప 2: బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న బన్నీ మ్యాజిక్!..అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు

Pushpa 2 Allu Arjuns Magic Ready To Dominate Box Office Again, Pushpa 2 Dominate Box Office Again, Box Office Dominate, Pushpa 2 Ready Dominate Box Office, AB Devlliers, Alluarjun, Boxofficerecords, Indiancinema, Pushpa 2 Grand Release, Pushpa 2 Release On December 5Th, Pushpa 2 New Records, Allu Arjun Sets New Records, Pushpa Release, Allu Arjun, Pushpa 2, Pushpa 2 Tckets, Indian Cinema, Rashimka, Sukumar, Pushpa 2 Movie, Pushpa 2 Latest News, Allu Arjun Pushpa 2 Movie, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates,Mango News, Mango News Telugu

‘పుష్ప 2’ సినిమాపై దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. 2021లో విడుదలైన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా, భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీగా ఉంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 12,000కు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

అల్లు అర్జున్, జాతీయ ఉత్తమ నటుడిగా నిలుస్తూ, నార్త్ ఆడియన్స్‌ను తన యాక్టింగ్‌తో ఫిదా చేశారు. దీంతో ‘పుష్ప 2’పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కొత్త రికార్డులు నెలకొల్పింది. 35.7 కోట్ల నెట్ వసూళ్లను ప్రీ సేల్స్ ద్వారా రాబట్టి, ఫస్ట్ డే 250 నుండి 275 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కొంత మందగించినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ ఆధారంగా వసూళ్లు పుంజుకుంటాయని అంచనా.

ఇంటర్నేషనల్ స్థాయిలో ‘పుష్ప 2’ క్రేజ్ విస్తరిస్తోంది. ఈసారి సౌత్ ఆఫ్రికా క్రికెట్ స్టార్ ఏబీ డివిలియర్స్ కూడా ఈ మ్యానియాలో భాగమయ్యారు. ‘పుష్ప 2’ టికెట్లపై ఆసక్తి చూపించిన డివిలియర్స్, తన అభిమానులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫార్మ్ Wolf7pay లో వంద లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన మొదటి 10,000 మందిలో ఎంపికైన వారికి ‘పుష్ప 2’ సినిమా టికెట్లు బహుమానంగా అందజేస్తామని ప్రకటించారు.

ఈ ఏడాదిలో అత్యంత భారీ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచే అవకాశం ఉన్న ‘పుష్ప 2’ టికెట్లు పొందేందుకు, వెంటనే Wolf7pay లో లాగిన్ కావాలని డివిలియర్స్ పిలుపునిచ్చారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది, ‘పుష్ప 2’ పై మరింత హైప్‌ను పెంచింది.