ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 బ్రేక్ చేయని రికార్డు అంటూ ఏదీ లేదన్నట్లుగా టాక్ నడుస్తోది. ఎన్నో దశాబ్దాల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ఎణ్నో రికార్డ్స్ ని బద్దలు కొడుతుంది. ఈ వీకెండ్తో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని దాటి 18వందల కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోనున్న పుష్ప 2.. ఫుల్ రన్ లో 2వేల కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదంతా పక్కన పెడితే తెలంగాణ ప్రాంతంలో ‘పుష్ప 2 ‘ 23 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మూవీకు ఉన్న రికార్డుని బద్దలు కొట్టి ఆల్ టైం సెన్సేషనల్ రికార్డుని క్రియేట్ చేసింది.
20 రోజులుగా సంధ్య థియేటర్ పేరు దేశవ్యాప్తంగా న్యూస్ లో తెగ వినిపిస్తోంది. దురదృష్టవశాత్తూ తొక్కిసలాట ఘటన జరగకపోయి ఉంటే వేరే విధంగా టాక్ నడిచేది. నిజానికి సంధ్య థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వైకుంఠం లాంటిది. దీనిలోనే ఖుషి, తొలిప్రేమ వంటి చిత్రాలు అప్పట్లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పాయి. తొలిప్రేమ చిత్రం 220 రోజులకు 1 కోటి 10 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడితే, ఖుషీ చిత్రం ఏకంగా 1 కోటి 58 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
అంతేకాదు ఇప్పటి వరకు ఈ థియేటర్ లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తమ సత్తాను చాటుకుంటూ వచ్చాయి. ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే కానీ ఏ సినిమా కూడా ఖుషీ మూవీ గ్రాస్ వసూళ్ల రికార్డుని దాటలేకపోయింది. ప్రభాస్ నటించిన కల్కి మూవీకి కోటి 50 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినా కూడా., ఖుషీ రికార్డుని మాత్రం బీట్ చేయలేక అక్కడే ఆగిపోయింది.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ మూవీ మాత్రం కేవలం 24 రోజుల్లోనే ఖుషి థియేటర్ రికార్డుని క్రాస్ చేసిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఆరోజుల్లో ఖుషీ చిత్రం పది రూపాయిల టికెట్ రేట్తో ఈ స్థాయి వసూళ్లు సాధించి ఇన్ని రోజులు అన్ బీటబుల్ రికార్డుగా ఉందంటే అది సాధారణమైన విషయం కాదు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇన్ని రోజులు పదిలంగా ఉన్న ఈ అనితరసాధ్యమైన రికార్డు..ఇప్పుడు బద్దలైందని పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. మరో 90 రోజుల్లో పవన్ నటించిన ‘హరి హర వీరమల్లు’ మూవీ విడుదల కాబోతుంది. మార్చి 28 న హరిహరవీరమల్లుగా పవన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో పవర్ స్టార్ ఈ థియేటర్ లో మరోసారి ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతాడో లేదో చూడాలి.