సరికొత్త రికార్డ్:1,500 స్క్రీన్స్ లో విడుదల కాబోతున్న పుష్ప-2

Pushpa 2 To Be Released In 1500 Screens, Pushpa 2 In 1500 Screens, 500 Screens, Allu Arjun Pushpa 2, Pushpa 2 Movie, Pushpa 2 Release In 11, The Rule New Release Date, Pushpa 2 Release Date Confirmed, Pushpa 2 Release Update, Pushpa 2 Latest Update, Allu Arjun, Pushpa 2, Pushpa The Rise, Rashmika Mandanna, Pushpa 2 Movie, Pushpa 2 Latest News, Allu Arjun Pushpa 2 Movie, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం పుష్ప2 సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రేక్షకులు తెలుగు రాష్ట్రాలకన్నా ఎక్కువ ఉత్సుకతతో ఉన్నారు. ఈ సినిమా రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందా? అంటూ ఎదురుచూస్తున్నారు.

డిసెంబరు 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల జరిగిన నేషనల్‌ ప్రెస్‌మీట్‌లో తెలియజేశారు నిర్మాతలు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో సన్సేషనల్‌ న్యూస్‌ను వెల్లడించారు మేకర్స్‌. పుష్ప-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి 11,500 స్ర్కీన్స్‌ల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు మేకర్స్‌. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో 11,500 స్క్రీన్స్ లో విడుదల కాబోతోంది. ఇంతవరకు భారతదేశానికి చెందిన ఏ సినిమా కూడా ఈ స్థాయిలో విడుదల కాలేదు. విడుదలరోజే రికార్డులను నెలకొల్పుతున్న పుష్ప2 విడుదలైన తర్వాత మరెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. మొత్తం 11,500 స్క్రీన్స్ లో ఇండియాలో 6,500 స్క్రీన్స్, విదేశాల్లో 5,000 స్క్రీన్స్ లో విడుదలవుతోంది.

దీంతో బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న పుష్ప2 కలెక్షన్ల విషయంలో ఎదురులేకుండా దూసుకువెళుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ వార్తతో అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు అంచనాలను పెంచేశాయి. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమా ఇది. ఇంతకుముందు ఆర్య, ఆర్య2, పుష్ప1 రాగా, ఇప్పుడు పుష్ప2 రాబోతోంది. కొద్దిరోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన విషయాలను చిత్ర యూనిట్ పంచుకుంటుండటంతో రోజురోజుకు సినిమాపై ఆసక్తి పెరగడంతోపాటు అంచనా కూడా పెరుగుతోంది.