పుష్ప మూవీ రివ్యూ

Allu Arjun, Allu Arjun And Rashmika Mandanna Movie, Allu Arjun And Rashmika Mandanna Movie Is Getting Huge Response, DSP, Mango News, Mango News Telugu, Pushpa, Pushpa FIRST movie review, Pushpa First Review, pushpa movie, Pushpa Movie Latest News, Pushpa Movie Live Updates, Pushpa Movie News, Pushpa Movie Public Response, Pushpa Movie Public Talk, Pushpa Movie Review, Pushpa Movie Story, Pushpa Movie Update, pushpa movie updates, Pushpa Part 1, Pushpa Raj, Pushpa Review, pushpa telugu movie, Pushpa Telugu Movie Latest News, Pushpa Telugu Movie Live Updates, Pushpa Telugu Movie Review, Pushpa Telugu Movie Updates, Pushpa The Rise, Pushpa The Rise Movie Review, Pushpa The Rise Review, Pushpa The Rise Telugu Movie Review, Rashmika Mandanna, sukumar, Thaggedhe Le

తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రిమూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప సినిమా 2 భాగాలుగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. పుష్ప : ది రైజ్ – పార్ట్ 1 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు.. తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలలో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

పుష్పరాజ్ గా బన్నీ :-

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ఆర్య, ఆర్య2 మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 3వ చిత్రం ఇది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ గా ఊర మాస్ పాత్రలో కనిపించి ప్రేక్షకులకు థ్రిల్ కలిగించాడు. ఇప్పటివరకు కనిపించిన బన్నీ వేరు.. పుష్పలో కనిపించిన బన్నీ వేరు. ఎర్రచందనం స్మగ్లర్ గా పుష్పరాజ్ పాత్రలో పరకాయప్రవేశం చేశాడు బన్నీ. నడక తీరులో, మాట తీరులో పూర్తి వేరియేషన్ చూపించాడు బన్నీ. చిత్తూరు యాసలో బన్నీ పలికిన సంభాషణలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. పుష్పరాజ్ పాత్రలో బన్నీ విజృంభించి నటించాడు.

ఇతర తారాగణం :-

హీరోయిన్ రష్మిక పల్లెటూరు అమ్మయిగా కనిపించింది. అందంతోనే కాదు అభినయంతో కూడా మెప్పించింది రష్మిక. ఇక, మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ తెలుగులో అద్భుత పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో సాఫ్ట్ అండ్ కూల్ విలనిజంతో మెప్పించాడు. ప్రముఖ హాస్య నటుడు సునీల్ ఇందులో క్రూరమైన పాత్రలో కనిపించటం విశేషం. ప్రముఖ యాంకర్ అనసూయ కూడా విలక్షణ పాత్రలో కనిపించింది. ఇప్పటివరకు సునీల్ కానీ, అనసూయ కానీ ఇలాంటి కేరక్టర్స్ చేయలేదు. అజయ్ ఘోష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత ఐటం సాంగ్ తో తళుక్కుమంది. ఈ పాట వస్తున్నప్పుడు అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

టెక్నికల్ వాల్యూస్ :-

ఈ మధ్య కొంచెం వెనుకపడినట్లు కనిపించిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు. సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఐటం సాంగ్.. అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఓ రేంజులో నిలబెట్టింది. ఇక ప్రధానంగా చెప్పుకోవలసింది సినిమాటోగ్రఫీ గురించి.. ఈ మధ్యే ప్రీ రిలీజ్ వేడుకలో అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా సినిమాలో కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది అని ప్రశంసించాడు కూడా. పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన మిరోస్లా క్యూబా బ్రోజెక్ తన కెమెరా నైపుణ్యాన్ని తెలుగు తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ, మౌనిక తమ పనితనంతో సినిమాకు ప్రాణం పోశారు. సినిమా కథ మొత్తం ఆధారపడి నడిచే ఎర్రచందనం చెట్లు కానీ, దుంగలు కానీ సినిమాలో కనిపించేవేవీ నిజమైనవి కావు, కొన్ని సీన్స్ లో కనిపించే అడవులు, కొండ గుట్టలు కూడా వీరు ప్రతిసృష్టించినవే.

ముక్తాయింపు :-

పుష్ప సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఏంటో మరోసారి దేశవ్యాప్తంగా నిరూపితమైంది. కథల పరంగా కానీ, టెక్నికల్ గా కానీ, హై స్టాండర్డ్స్ లో సినిమాలు తీయగలం అని నిరూపిస్తున్నారు మన హీరోలు, దర్శకులు. పుష్ప సినిమా విడుదల అయిన అన్నిచోట్లా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రికార్డులు బద్దలు కొడుతోంది. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు ధైర్యంగా ఎదురుచూసేలా చేసింది. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 5 =