భారీ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమాల్లో ‘పుష్ప 2’ ఒకటనే విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌తో పాటు సినిమా దర్శకుడు అయిన సుకుమార్ కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించాలనే టార్గెట్‌తో ముందుకు సాగుతున్నాడు. ఇక ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేసుకున్న ఈ మూవీ మరో పది రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో భారీగా నిర్వహించాలనే ప్లాన్లో మూవీ టీమ్ ఉంది. ఈ ఈవెంట్ కోసం యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ అయితే బాగుంటుందని మూవీ మేకర్స్ అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఈవెంట్లో చాలామంది అల్లు అర్జున్, సుకుమార్ అభిమానులు పాల్గొనబోతున్నారు. వాళ్లందరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి పోలీస్ గ్రౌండ్స్ అయితే బాగుంటుందని దానిని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఇటు హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న వాటిలో పోలీస్ గ్రౌండ్స్ అయితేనే బెస్ట్ అని సినీ మేధావులు కూడా భావిస్తున్నారు.
ఇంతకుముందు పోలీస్ గ్రౌండ్స్‌లో చాలా సినిమా ఈవెంట్లు జరిగాయి. నవంబర్ 29న గాని, లేదంటే నవంబర్ 30న గాని ఈ ఈవెంట్‌ను జరిపే అవకాశాలున్నాయి. రేపటిలోగా డేట్, ప్లేస్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేయడానికి మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు.