రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజాసాబ్.. ప్రభాస్ పుట్టిన రోజుకు రెండు రోజుల ముందే ప్రభాస్ రాజాసాబ్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. గళ్ళ చొక్కా, లోపల టీ షర్ట్, బ్లాక ప్యాంట్, షూస్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని అదిరిపోయే లుక్స్ తో నిలబడ్డాడు ప్రభాస్. దీంతో ఈ పోస్టర్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. ప్రభాస్ లుక్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. అలాగే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అక్టోబర్ 23 వస్తుందని కూడా ప్రకటించారు. దీంతో ప్రభాస్ పుట్టిన రోజు నాడు రాజాసాబ్ నుంచి మరో గ్లింప్స్ రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుండగా ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ప్రభాస్ కల్కి సూపర్ హిట్ కావడంతో ఆయన రాజా సాబ్ కు బిజినెస్ వర్గాల్లో క్రేజ్ నెలకొంది. మారుతి దర్శకుడు కాబట్టి పెద్దగా క్రేజ్ లేదనుకున్న వాళ్లకు ఈ ప్రాజెక్టుకు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ చూస్తూంటే మతిపోతోంది. అఫ్ కోర్స్ అది ప్రభాస్ కు పెరిగిన ప్యాన్ ఇండియా మార్కెట్, సక్సెస్ , ఫామ్ లో ఉండటం వంటి కారణాలు కావచ్చు. కానీ ప్రభాస్ తో సినిమా చేస్తున్న వాళ్లకి అవన్నీ కలిసొచ్చే అంశాలే. ప్రభాస్ సినిమా అంటే ఖచ్చితంగా వందల కోట్లకు వసూలు చేయడం ఖాయం. అలాంటప్పుడు రిటర్న్స్ ఏ స్దాయిలో ఉంటాయా అని లెక్కలేసుకునే నిర్మాత చేస్తారు.
తాజాగా రాజాసాబ్ ఆడియో రైట్స్ కు భారీగా ధర పలికింది. రాజాసాబ్ ఆడియో హక్కుల్ని టీ సిరీస్ రూ.25 కోట్లకు సొంతం చేసుకొంది. ఈ స్దాయి క్రేజ్ కు ప్రభాస్ కొత్త తరహా కథలో నటిస్తుండడం ఓ విశషమైతే… ఇందులో ఆయన కొత్త స్టైల్‌తో కనిపించటం మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని ‘రాజాసాబ్’టీమ్ చెబుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, తమన్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా మాస్, కమర్షియల్ బీట్స్ ఉంటాయిని అంచనా వేస్తున్నారు. ‘రాజాసాబ్’ టైటిల్ ట్రాక్ కూడా ఓ రేంజిలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. దానికి తగినట్లు ఓ బాలీవుడ్ క్లాసిక్ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయబోతున్నారని మీడియా వర్గాల సమాచారం అందుతోంది.