దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజయిన అమరన్ సినిమా.. మెగా హిట్ టాక్ సంపాదించుకుంది. శివకార్తికేయన్, నేచురల్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ.. తెలుగు,తమిళ్ భాషల్లోనూ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో ఓసీన్ ను మూవీ యూనిట్ తాజాగా తొలగించింది.
మేజర్ ముకుంద్ వరదరాజన్ 31 ఏళ్ల వయస్సులో భారత్ శత్రువుల నుంచి రక్షించడానికి చేసిన ఆయన త్యాగానికి దేశ అత్యున్నత పురస్కారం అశోక్ చక్రను ప్రదానం చేశారు. దివంగత ముకుంద్ భార్య ఇందు ముకుంద్ 2015 రిపబ్లిక్ డే కార్యక్రమంలో అశోక్ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమా మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు.
అయితే సినిమాలోని ఓ సన్నివేశం ఇటీవల వివాదాన్ని రేపింది.ఈ మూవీలో ఓ సన్నివేశంలో హీరో, హీరోయిన్ నెంబర్ తీసుకునే సన్నివేశం ఉంటుంది. దీంతో సినిమా చూసిన చాలామంది ఆ ఫోన్ నెంబర్‌కు ఫోన్‌లు చేయడం మొదలు పెట్టారు. అది విఘ్నేశన్ అనే ఇంజనీర్ విద్యార్థిది కావడంతో..మూవీ టీమ్ వల్ల తనకు చాలా ఇబ్బంది ఎదురైందని..దీనికి గానూ నష్టపహారం కింద రూ. 1.1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
సినిమా విడుదలైనప్పటి నుంచి అలా కాల్స్ వస్తూనే ఉండటంతో.. నిద్ర, చదువు, ఇతర పనులు చేయడం లేదని చెప్పుకొచ్చాడు. అమరన్ చిత్రబృందానికి కోటి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని నోటీసులు పంపాడు. దీంతో విద్యార్థికి ఎలాంటి సమాధానం చెప్పారో తెలియదు కానీ.. సెల్‌ఫోన్ నంబర్‌తో కూడిన సీన్‌ను సినిమా నుంచి , ఇప్పుడు ఓటీటీలోను కట్ చేశారు.