2024లో తెలుగు సినిమా పరిశ్రమలో అనేక విశేషాలు చోటుచేసుకున్నాయి. తెలుగు సినిమా ప్రపంచాన్ని వదలకుండా ఆకట్టుకుంది. పలు పాన్-ఇండియా సినిమాలు మరియు కమర్షియల్ ఎంటర్టైనర్లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. విభిన్న కథలు, సాంకేతిక నైపుణ్యాలు, నటుల ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు విడుదలయ్యాయి.
హను-మాన్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సూపర్‌హీరో చిత్రం, హనుమంతుని శక్తులను పొందిన యువకుడి కథను ఆధారంగా తీసుకుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, సాంకేతిక నైపుణ్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం విజయం సాధించింది.
కల్కి 2898 AD
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ విజన్‌రీ సైన్స్ ఫిక్షన్ చిత్రం పాన్ ఇండియా ప్రేక్షకులను అబ్బురపరిచింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ తన కూతుర్లు ప్రియాంక దత్, స్వప్న దత్‌లతో కలిసి రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఈ చిత్రం రూ.1100 కోట్ల గ్రాస్‌ను సాధించి వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది.
మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీ
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.172 కోట్ల గ్రాస్ సాధించింది.
టిల్లు స్క్వేర్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ‘డిజె టిల్లు’ సీక్వెల్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూ.35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ.135 కోట్ల గ్రాస్‌ను సాధించింది.
నాని మూవీ
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. రూ.90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
దేవర పార్ట్ 1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా, ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం. రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలై రూ.500 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
కిరణ్ అబ్బవరం – క
కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో, సుజిత్ & సందీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం. రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్‌ను సాధించింది.
లక్కీ భాస్కర్
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, 1980ల కాలంలో సెట్ చేయబడింది. నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, కథనంలో మానవీయ కోణాలను చక్కగా చూపించింది. ఈ చిత్రం ఓటీటీలో కూడా చక్కటి విజయాన్ని అందుకుంది.
పేకమేడలు
నీలగిరి మామిల్లా దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ డ్రామా చిత్రం, మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ, కుటుంబ సంబంధాలను హృద్యంగా చూపించింది. వినోద్ కిషన్, అనూష కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.
పుష్ప 2: ది రూల్
అల్లు అర్జున్, రష్మిక మండన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ‘పుష్ప’ సీక్వెల్‌గా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, క్రైమ్, డ్రామా, యాక్షన్ అంశాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దేశవ్యాప్తంగా పుష్ప రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికికే 17 వందల కోట్ల వసూళ్లను సొంత చేసుకుంది. మరి కొద్దిరోజుల్లో బాహుబలి పార్ట్ 2 రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది.