బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా క్రికెటర్ రిషబ్ పంత్ తో డేటింగ్ వార్తలపై స్పందించారు. ఊర్వశి రౌతేలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. క్రికెటర్ రిషబ్ పంత్ గురించి అడుగుతూ డేటింగ్ వార్తలు నిజమేనా? అనే ప్రశ్న రాగానే ఊర్వశి ఖండించింది. ఊర్వశి మాట్లాడుతూ.. ఆర్‌పి అంటే రిషబ్ పంత్‌తో లింక్ అప్ గురించి ఎప్పుడూ వచ్చే వార్తల గురించి, ఈ మీమ్స్, రూమర్లు కేవలం ఫేక్ విషయాలు అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలని నేను నమ్ముతాను. నేను నా కెరీర్, నా పనిపై దృష్టి పెడుతున్నాను. వీటిపై నేను మక్కువ చూపుతున్నాను అని ఆమె పేర్కొంది. రిషబ్ పంత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసింది.
నటి ఇంకా మాట్లాడుతూ.. ఇటువంటి విషయాలను స్పష్టతతో పరిష్కరించడం, ఊహాగానాల కంటే వాస్తవాలపై దృష్టి పెట్టడం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. మీమ్స్ మెటీరియల్ పేజీలు ఎందుకు ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాయో ఇప్పటి వరకు నేను అర్థం చేసుకోలేకపోయను అని పేర్కొంది. నా వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడం, అలాంటి తప్పుడు పుకార్లు వ్యాపింపచేయడంతో తనకు చాలా కష్టంగా మారిందని.. ఈ పుకార్లు తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా తెలిపింది. వీటిని ఎదుర్కోవడంతో పాటు నా పని మరింత మెరుగ్గా ఎలా చేయగలను అనే దానిపై దృష్టి పెట్టగలను అని మాత్రమే ఆలోచించాను అని చెప్పుకొచ్చింది.
కాగా రిషబ్ పంత్ం- ఊర్వశి ఎఫైర్‌కు సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. ఊర్వశి- రిషబ్ పంత్ నిజంగా డేటింగ్ చేస్తున్నారా లేదా అని అభిమానులు కూడా ఉత్సుకత ప్రదర్శిస్తుంటారు.. కాగా ఇప్పుడు ఈ వార్తలపై నటి తొలిసారిగా స్పందించింది. వారి ఎఫైర్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో వస్తున్న గాసిప్స్, మీమ్స్ అన్ని నిరాధారమైనవని వాటని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని స్పష్టం చేసింది.