డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ

Dear Comrade Movie Mouth Talk, Dear Comrade Movie Public Talk, Dear Comrade Movie Review, Dear Comrade Movie Review And Ratings, Dear Comrade Movie Story, Dear Comrade Review, Dear Comrade Telugu Movie Live Updates, Dear Comrade Telugu Movie Public Response, Dear Comrade Telugu Movie Review, Latest telugu movie reviews, Latest Telugu Movies News, Mango News, Telugu Film News 2019, Tollywood Cinema Updates, Vijay Devarakonda Starrer Dear Comrade Movie Review

నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన, శ్రుతి రామచంద్రన్, సుహాస్
డైరెక్టర్: భరత్ కమ్మ
నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్‌, బిగ్‌బెన్‌ సినిమా
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్

మైత్రి మూవీ మేకర్స్, బిగ్‌బెన్‌ సినిమా నిర్మాణంలో, భరత్ కమ్మ దర్శకత్వంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదలయింది. విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన డియర్ కామ్రేడ్ చిత్రం అంచనాలకు తగ్గట్లే హిట్ రిపోర్ట్స్ తెచ్చుకుంది. తిరుగుబాటు భావజాలంతో ఉండే బాబీ (విజయ్ దేవరకొండ), లిల్లీ (రష్మిక మందన) తో ప్రేమలో పడతాడు,ఇలాంటి తరుణంలో తనకు నచ్చిన భావజాల మార్గంలో వెళ్లేందుకు ప్రేమ విషయంలో ఎలాంటి సంఘర్షణకు గురయ్యాడు, అతను తీసుకున్న నిర్ణయం లిల్లీ జీవితం పై ఎలాంటి ప్రభావం చూపింది, వాటి పర్యవసానాలు బాబీ ఎలా ఎదురుకున్నాడు అనే ఆసక్తికర అంశాలు వెండితెరపై చూడాల్సిందే.

వివరణ:

ఒక్కో సినిమాతో పైకి ఎదుగుతున్న విజయ్ దేవరకొండ,డియర్ కామ్రేడ్ చిత్రంతో మరోసారి నిరూపించుకున్నాడు. తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు,కాలేజ్ లీడర్, ప్రేమికుడిగా, ప్రేమకు దూరమైనా భగ్న ప్రేమికుడిగా, చివరికి తాను అనుకున్నది సాధించే కామ్రేడ్ గా వివిధ గెటప్స్ లో కనిపిస్తూ పాత్రకి ప్రాణం పోశాడు. రష్మిక తన నటనతో ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది, గీతాగోవిందం తరువాత విజయ్ దేవరకొండ,రష్మిక మధ్య వచ్చే లవ్, రొమాన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. సుహాస్ తన నటనతో మెప్పించాడు, ఇక మిగిలిన నటి నటులు వారి పరిధి మేరకు అలరించారు.

ఈ చిత్రంలో మంచి పాటలు, నేపధ్య సంగీతంతో సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ తన ముద్ర వేసాడు. సినిమా అంతటా ఒకే మూడ్ కొనసాగించడంలో కెమెరామెన్ సుజిత్ సారంగ్ మంచి ప్రతిభ కనబరిచాడు, కాకినాడ పరిసర ప్రాంతాలను చక్కగా చూపించారు, చిత్రం ఆసాంతం మంచి నిర్మాణ విలువలతో సాగుతుంది. భరత్ కమ్మ మంచి పాయింట్ తీసుకొని, ప్రేమ, భావోద్వేగాలతో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాడు. మంచి కథనంతో యువతను మెప్పించేలా తీసి, తోలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి మంచి విజయం సాధిస్తుంది.

[wp-review id=”647″]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − two =