హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం ‘విశ్వం. ఈ మూవీ చడీ చప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్టోబర్ 11న థియేటర్లలలో రిలీజైన ఈ సినిమా ఈరోజు (నవంబర్ 1)న ఓటీటీలో అడుగుపెట్టింది. అంటే థియేటర్లో రిలీజైన 20 రోజులకే విశ్వం ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక్క తెలుగులో మాత్రమే విశ్వం స్ట్రీమింగ్‌కి వచ్చింది.
రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.17 కోట్ల వరకే వసూలు చేసినట్లు టాక్ . గోపీచంద్ విషయానికొస్తే చాలా నమ్మకంతో విశ్వం సినిమా చేశారు. కానీ శ్రీనువైట్ల కూడా గోపీచంద్‌కి హిట్టు ఇవ్వలేకపోయారు. వెంకీ సినిమాలోని ట్రైన్ సీక్వెన్స్ లాంటిదే విశ్వంలో కూడా ట్రై చేశారు శ్రీనువైట్ల. ఇది థియేటర్లో బాగానే నవ్వులు పూయించింది. కానీ లాంగ్ రన్‌లో సినిమాను మాత్రం నిలబెట్టలేకపోయింది.
గత నెల ఆక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి విజయం సాధించింది. ఇక విశ్వం సినిమాకి ముందు భీమా, రామబాణం చిత్రాలు చేశారు గోపీచంద్. ఈ రెండు సినిమాల్లో రామబాణం డిజాస్టర్ కాగా భీమా మంచి టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఇలా యాక్షన్, కామెడీ ఏది ట్రై చేసినా గోపీచంద్‌కి హిట్ మాత్రం రావడం లేదు.
ఇక చాలా ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం శ్రీనువైట్ల ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 2018లో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని తీసిన శ్రీనువైట్ల ఆ సినిమా రిజల్ట్ కారణంగా దాదాపు ఆరేళ్ల పాటు సైలెంట్ అయిపోయారు. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే దసరాకి గోపీచంద్‌తో కలిసి ‘విశ్వం’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు శ్రీను. ఈ దసరా కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి రాగా ఇప్పుడు దీపావళి కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమా అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.