ఈ ఏడాది జూన్ 27న రిలీజ్ కాబోనున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ.. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోన్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
దీపికా పదుకొణెతో పాటు బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ గెస్ట్ రోల్‌లో మెరవనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి సినిమా.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడప్ చేసింది మూవీ యూనిట్ .
తాజాగా‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారు హాట్ టాపిక్‌గా మారింది. రామోజీ ఫిల్మ్ సిటీలో దీన్ని ఆవిష్కరించడంతో.. చాలా మంది ఆటోమొబైల్ వినియోగదారులు దీనిపై వీడియోలు చేశారు. దాదాపు ఐదు కోట్ల రూపాయలతో తయారు చేసిన బుజ్జిపై సెలబ్రెటీలు కూడా మనసు పారేసుకుంటున్నారు. ఆటో మొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా ఆ బుజ్జిపై ప్రశంసలు కురిపించారు. మొన్నటికి మొన్న ప్రభాస్ ఈ కారును నడుపుతూ కనిపించి సందడి చేయగా..రీసెంట్‌గా నాగ చైతన్య కూడా బుజ్జి కారును నడిపాడు.
మరోవైపు ఈ కారును వివిధ సిటీలకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్న కల్కి టీమ్.. భారతదేశంలోని మెయిన్ సిటీలలో దీన్ని ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తోంది. అంతేకాదు ఆ సమయంలో అభిమానులను సెల్ఫీలు తీసుకోవడానికి టీమ్ అనుమతివ్వడానికి సిద్ధం అవుతోంది. అలాగే నాగ చైతన్య లాగా ప్రముఖ సెలబ్రిటీలకు కూడా ఈ బుజ్జి కారు డ్రైవింగ్‌కు కూడా ఇస్తారని టాక్ నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY