1993 ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు మృతి

1993 Mumbai Serial Blasts' Convict Yusuf Memon died in Nashik Jail

1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యూసుఫ్ మెమన్ ఈ రోజు ఉదయం మహారాష్ట్రలోని నాసిక్‌ జైలులో మృతి చెందినట్టు జైలు అధికారులు వెల్లడించారు. అయితే యూసుఫ్ మెమన్ ఎలా మృతి చెందాడనే వివరాలు, కారణాలను అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం మెమన్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ధూలేకి తరలించినట్టుగా తెలుస్తుంది. ముంబయి బాంబు పేలుళ్ల ఘటన తర్వాత‌ భారత్‌ నుంచి పరారైన గ్యాంగ్‌స్టర్ టైగర్‌ మెమన్‌కు యూసుఫ్‌ సోదరుడు. మార్చి 12, 1993 న ముంబయిలో జరిగిన వరుస పేలుళ్లలో 257 మంది మృతిచెందగా, వందలాది మంది గాయపడ్డారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu