2012 ప్రపంచం అంతం అవుతుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.దీనిని బేస్ చేసుకుని ఆ సమయంలో 2012 అనే హాలీవుడ్ సినిమా కూడా తీసారు. యుగాంతం ఎలా ఉంటుందో అందులో చూపించిన విధానానికి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ అదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు కొత్త తరహా శకానికి ముగింపు పలకడంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. చివరకు నాసా శాస్త్రవేత్తలు కూడా దీనిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు.
అంతరిక్షంలో మార్స్ , బృహస్పతి మధ్య గ్రహశకలాలు తిరుగుతాయని మనందరికీ తెలుసు. ఈ గ్రహాల శకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అందుకే, అప్పుడప్పుడు ఈ గ్రహశకలాలలో కొన్ని భూమికి దగ్గరగా వస్తాయి. ఇలా 2029లో ఓ గ్రహశకలం రానుందని.. దాని పేరు అపోఫిస్ అని సైంటిస్టులు చెబుతున్నారు. నిజానికి అపోఫిస్ అంటే ఊహించలేని దేవుడు. అందుకే ఈ గ్రహశకలం పేరు వచ్చిందట. ఈ గ్రహశకలం మనకు ఎప్పుడూ ఊహించలేని సవాలు విసురుతూనే ఉంటుంది.
ఆ గ్రహశకలం 2029లో భూమికి దగ్గరగా వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, అది భూమిని తాకుతుందనే అనుమానాన్ని సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు. అపోఫిస్ గ్రహశకలం 2004లో కనుగొనబడింది. 2029 సంవత్సరంలో, ఇది భూమికి దగ్గరగా ఉంటుంది. ఆ సమయంలోనే దీనిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని సైంటిస్టులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒకవేళ ఆ గ్రహశకలం భూమిని ఢీకొని.. ఘర్షణ జరిగితే పెను ప్రమాదం సంభవించనుంది. దీనికోసమే ఇప్పుడు నాసా సిద్ధమవుతోంది.దీనిని నిరంతరం గమనిస్తూనే ఉంది.
ఈ గ్రహశకలం చిన్నది కాదు. ఇది 350 మీటర్ల పెద్దది. అంటే సుమారు ఇది ఈఫిల్ టవర్ పరిమాణంలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఇది పెద్ద ఓడ లాంటిది. కాబట్టి ఈ శకలం భూమిని ఢీకొంటే, అది దేశ భూభాగాన్ని నాశనం చేయగలదు. అదే సముద్రాన్ని తాకితే సునామీలు వచ్చినట్లే. దీనికి తోడు భూమిపై వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతగా అంటే ప్రజలు ఊపిరి కూడా పీల్చుకోలేకపోవచ్చు.
ప్రస్తుత అంచనాల ప్రకారం, ఏప్రిల్ 13, 2029న ఈ గ్రహశకలం భూమికి అత్యంత సమీపంలోకి వస్తుంది. ఇది 32,000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుంది. ఇది క్రాష్ కాకపోతే, దీని ప్రయాణం మరో 100 సంవత్సరాలు కొనసాగుతుంది. మన ఉపగ్రహాలు 20,000 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతుండటంతో భూమికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. అయితే గ్రహశకలం భూమిని ఢీకొట్టకపోయినా, ఉపగ్రహాలను ఢీకొన్నా, అవి భూమిపై పడే ప్రమాదం ఉంటుంది.
2029 అంటే 5 సంవత్సరాలలో ఈ గండం రానుంది. నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఈ అపోఫిస్ గ్రహశకలాన్ని పరిశీలిస్తోంది. అంతరిక్షంలో ఉన్న గ్రహశకలం భూమిని ఢీకొనే స్థితికి కనుక వస్తే దానిని పేల్చే సాంకేతికతను నాసా అభివృద్ధి చేస్తోంది. అయితే ఐదేళ్లలో ఆ గ్రహశకలాన్ని పేల్చేంతగా సాంకేతిక ఎదగగలదా అనేది మరో ప్రశ్న. ఒకవేళ గ్రహశకలం భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశిస్తే మాత్రం, వాతావరణ కోత స్వయంచాలకంగా పేలుతుంది. అది పేలినా ఆ ముక్కలన్నీ నేలమీద ఎక్కడో పడిపోవచ్చు. అది ఇంకా ప్రమాదం. అందుకే శాస్త్రవేత్తలు ఇప్పుడు దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ