H1B వీసా ప్రొగ్రామ్ లో పలు కీలక మార్పులు జరిగాయి. యూఎస్‌లో వివిధ కంపెనీలు పలు రంగాల్లో ఉద్యోగులను నియమించుకునేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ వచ్చే ఏడాది జనవరి 17 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ద్వారా స్కిల్డ్ ఎంప్లాయీస్ కొనసాగించేందుకు మరింత వెసులుబాటు కల్పిస్తోంది. బైడెన్ అధ్యక్ష పదవినుంచి దిగిపోయే ముందు తీసుకున్న చివరి నిర్ణయం ఇది.
H1B వీసా కేటగిరిలో అత్యధికంగా వాటా పొందుతున్నది భారత్. కాబట్టి అమెరికా వెళ్లాలనుకునేవారంతా ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. దీంతోపాటు H1B వీసా అప్డేట్ తో F1 వీసాలపై అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ కు లబ్ది చేకూరనుంది. కొత్త నిబంధనలు వారిని ఉద్యోగాల్లోకి మారడానికి అవకాశం కల్పిస్తున్నాయి.
అమెరికా సంవత్సరానికి 85వేల H1B వీసాలను జారీ చేస్తుంది. వీటిలో సాధారణ క్యాప్ కు 65వేలు కాగా, యూఎస్ అడ్వాన్స్డ్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ హోల్డర్లకు మరో 20వేల వీసాలను జారీ చేస్తుంది. అయితే ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో ఈ లిమిట్ మినహాయించబడింది. అయితే దరఖాస్తుదారులు ఫారమ్ కొత్త ఎడిషన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. నాన్ ఇమ్మిగ్రేషన్ వర్కర్స్ తమ హెచ్1బీ దరఖాస్తులను I-129 ఫారం సమర్పించాలి. అమెరికాలో F1 వీసాలతో ఉన్న విద్యార్థులు H1B వీసాలకు మారాలనుకుంటే అనుమతిస్తుంది. ఇది వారికి చట్టబద్ధంగా ఉద్యోగాలు కల్పించడంలో సహాయపడుతుంది. ఇది భారతీయులకు ఎంతో ఉపయోగకరమైన నిబంధన.
అయితే యూఎస్ సిటిజన్ షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిబంధనలకు లోబడి పనిచేయని కంపెనీలు, యజమానులపై చర్యలకు యూఎస్‌సీఐఎస్ కు ఎక్కువ అధికారాలు ఉంటాయి. H- 1B నాన్ ఇమిగ్రెంట్ వీసా ప్రోగామ్ యూఎస్ కంపెనీలు తాత్కాలికంగా వీదేశీ ఉద్యోగులను ప్రత్యేక వృత్తులలో నియమించుకోవడానికి అనుమతిస్తుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారు ఏ ఉద్యోగానికి సరిపోయే డిగ్రీలు కలిగి ఉన్నారో చూపించాలి. ఇది వారి ప్రోగ్రామ్ మిస్ యూస్ కాకుండా చేస్తుంది.
కొత్త నిబంధనల్లో వీసా ఎక్స్ టెన్షన్ రిక్వెస్ట్, రెన్యువల్ విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు మరిన్ని అధికారాలు కల్పించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా ఎక్స్ టెన్షన్ రిక్వెస్టులను ప్రాసెస్ చేస్తున్నప్పుడు , రెన్యువల్ ప్రక్రియను క్రమబద్దీకరించేటప్పుడు ముందస్తు ఆమోదాలను వాయుదా వేయొచ్చు. కొత్త నిబంధనల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్, మరిన్ని అధికారాలు ఇచ్చారు. H-1B వీసా రెగ్యులేషన్ లో భాగంగా కంపెనీలను తనిఖీ చేయొచ్చు. నిబంధనలు పాటించని కంపెనీలపై జరిమానా, వీసా రద్దు చేయొచ్చు.