కొత్త లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

Coronavirus, Coronavirus second wave, COVID-19 fight, Mango News, New Coronavirus Lockdown Rules, Tamil Nadu Covid lockdown, Tamil Nadu Covid lockdown news, Tamil Nadu Covid lockdown news live, Tamil Nadu Govt, Tamil Nadu Govt Announced New Lockdown Guidelines, Tamil Nadu Govt Announces New Coronavirus Lockdown Rules, Tamil Nadu govt issues new lockdown guidelines, Tamil Nadu Lockdown, Tamil Nadu Lockdown 2021, Tamil Nadu Lockdown 2021 News Today, Tamil Nadu to impose lockdown on Sunday, TN announces more restrictions

రాష్ట్రంలో రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కొత్త లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ ఆంక్షలు ఏప్రిల్ 26 ఉదయం 4 గంటల నుండి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. పుదుచ్చేరి మినహా విదేశాలనుండి, ఇతర రాష్ట్రాలనుండి తమిళనాడుకు వచ్చే వాళ్ళు https://eregister.tnega.org/ లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఈ-పాస్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు తమిళనాడులో ఇప్పటివరకు మొత్తం 10,66,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 9,52,186 మంది కరోనా నుంచి కోలుకోగా, 13,475 మంది మరణించారు. ప్రస్తుతం 1,00,668 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

తమిళనాడులో అమల్లోకి రానున్న కొత్త ఆంక్షలు ఇవే:

 • లార్జ్ ఫార్మాట్ షాపులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, మాల్స్ కు అనుమతి లేదు. 50 శాతం సామర్థ్యంతో డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌ కు అనుమతి.
 • సినిమా థియేటర్లు, జిమ్ లు మూసివేత.
 • రెస్టారెంట్లు, హోటళ్ళు, మెస్, టీ షాపులలో పార్శిల్/టేక్ అవేకు మాత్రమే అనుమతి. డైన్ ఇన్‌పై కార్యకలాపాలపై నిషేధం.
 • రిక్రియేషన్ క్లబ్‌లు, బార్‌లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు మూసివేత.
 • బ్యూటీ పార్లర్లు, స్పాస్, సెలూన్లు, బార్బర్ షాప్స్ మూసివేత.
 • అన్ని ఇ-కామర్స్ కార్యకలాపాలపై సమయ పరిమితులతో అనుమతి.
 • రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా స్థలాలలో ప్రజలకు అనుమతి లేదు.
 • గోల్ఫ్, టెన్నిస్ క్లబ్‌లు మరియు స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీలకు అనుమతి లేదు.
 • జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్ల శిక్షణకు అనుమతి.
 • వివాహాలలో 50 మంది అతిథులకు అనుమతి.
 • అంత్యక్రియలకు 25 మంది మాత్రమే హాజరు కావాలి.
 • ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు కనీసం 50 మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాలి.
 • టాక్సీ/క్యాబ్ లలో గరిష్టంగా 3, ఆటోలలో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి.
 • రాత్రి కర్ఫ్యూ మరియు ఆదివారం లాక్‌డౌన్ కొనసాగింపు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =