తెలంగాణ గవర్నర్‌గా అశ్వినీకుమార్ చౌబే

Ashwini Kumar Choubey Is Likely To Be Appointed As The New Governor Of Telangana, Ashwini Kumar Choubey Is Likely The New Governor,Ashwini Kumar Choubey,The New Governor Of Telangana,Governor Of Telangana,Governor, PM Modi,Telangana,Telangana Politics,Telangana Live Updates,KCR,Revanth Reddy,Telangana,Mango News, Mango News Telugu
telangana, Ashwini Kumar Choubey, Governor, pm modi

తెలంగాణ గవర్నర్‌గా ఎవరిని నియమిస్తారనే దానిపై కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల కొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసినప్పటి నుంచి.. జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ ఇంఛార్జి గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ లేరు. ఈక్రమంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ కొత్త గవర్నర్‌గా ఎవరు రాబోతున్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన్ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తారని వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరుపున రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈక్రమంలో ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారని.. తెలంగాణకు పంపిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన్ను కర్ణాటక గవర్నర్‌గా పంపిస్తారని తెలుస్తోంది. ఈక్రమంలో తెలంగాణ గవర్నర్‌గా ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన బీహార్ బీజేపీ నేత అశ్వినీకుమార్ చౌబేను నియమిస్తారని టాక్ నడుస్తోంది.

బీజేపీ సీనియర్ నేతల్లో అశ్వినీ కుమార్ చౌబే ఒకరు. ఆయన అయిదుసార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆయనకు ఎంపీ టికెట్ దక్కుతుందని చౌబే ఆశించారు. కానీ ఆయనకు 70 ఏళ్లు నిండినందున టికెట్ ఇవ్వకుండా అధిష్టానం పక్కకు పెట్టింది. ఈక్రమంలో అశ్వినీ కుమార్ అలకబూనారు. వచ్చే ఏడాది బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా అశ్వినీ కుమార్‌ను సంతృప్తి పరచకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ పడుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే అశ్వినీ కుమార్ చౌబేను తెలంగాణ గవర్నర్‌గా పంపించాలని మోడీ నిర్ణయించారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE