ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి..

Atishi Is The New CM Of Delhi, New CM Of Delhi, Delhi New CM, Aam Aadmi Party, AAP Chief Arvind Kejriwal, Delhi New CM, Atishi Marlena Elected AAP Leader, Delhi New Chief Minister, Atishi Chief Minister, Delhil, Latest Delhi News, Delhi Live Updates, National News, India, Congress, BJP, PM Modi, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్షానికి కొత్త నేతగా అతిషి ఎన్నికయ్యారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. కాగా ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరిన పదేళ్లకే అతిశీ సీఎం కావడం విశేషం. ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో ప్రారంభమైంది. ఆ మరుసటి సంవత్సరం అతిషి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ఏడాదిలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది.

2023లో మంత్రివర్గంలో చేరిన అతిషి

2022 మరియు 2023లో, ఢిల్లీ ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మనీష్ సిసోడియా మరియు అప్పటి సత్యేందర్ జైన్ రాజీనామాల కారణంగా కొన్ని మంత్రి పదవులు ఖాళీ కావడంతో అతిషిని తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారు కేజ్రీవాల్. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినప్పటికీ, విద్య, స్త్రీ శిశు సంక్షేమం, సంస్కృతి, పర్యాటకం మరియు పబ్లిక్ వర్క్స్ వంటి శాఖలను ఆమేకు అప్పగించారు. మంత్రిత్వ శాఖలను నిర్వహించిన అనుభవం లేకపోయినప్పటికీ, ఈ విభాగాలన్నింటిని ఏకకాలంలో సక్రమంగా నడిపించి సత్తా చాటారు అతిషి. అందుకే ఆమె తక్కువ కాలంలోనే ప్రభుత్వంలో ప్రభావశీల నాయకురాలిగా ఎదగగలిగారు.

కేజ్రీవాల్ తన రాజీనామాను ప్రకటించిన తర్వాత, తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు అనే చర్చలు ప్రారంభమైనప్పుడు అతిషి పేరు తెరపైకి వచ్చింది. దీంతో అతిషి పేరు గూగుల్ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీలో తో పాటు  చండీగఢ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో అతిషి గురించి వెతకడంతో గూగుల్ ట్రెండ్స్ లోకి అతిషి పేరు వచ్చింది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో విద్యా

జూన్ 8, 1981న ఢిల్లీలోని పంజాబీ మూలాలున్న కుటుంబంలో జన్మించిన అతిషి పూర్తి పేరు అతిషి మర్లెనా సింగ్. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. తరువాత ప్రతిష్టాత్మకమైన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి MA డిగ్రీని అభ్యసించాడు. ఆమె భర్త పేరు ప్రవీణ్ సింగ్. అందుకే ఆయన పేరు ముందు సింగ్ అనే పేరు వచ్చింది. అయితే, ప్రజలు తనను తన పేరుతో మాత్రమే గుర్తించాలని, తన పేరు ముందు మార్లెనా మరియు సింగ్ అనే పదాలను తొలగించి, తన పేరును క్యాబినెట్ మరియు ఇతర ప్రభుత్వ ఫైళ్లలో అతిషి అని మాత్రమే పేర్కొన్నారు.