ఇండియా మాట వినని బంగ్లాదేశ్

Bangladesh Does Not Listen To India, Bangladesh Does Not Listen, Bangladesh Issue, Bangladesh Hindu Fight, Bail Petition, Bangladesh, Hindu Religious Leader Chinmayi Krishnadas, India Former Iskcon Guru, Krishna Das, India, National News, International News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

బంగ్లాదేశ్ ..ఇండియా చెప్పినా వినటం లేదు. వార్నింగ్ ఇచ్చినా బెదరటం లేదు.. ఇస్కాన్ మాజీ గురువును నెల రోజులకు పైగానే జైల్లో పెట్టింది. హిందూ మత గురువు చిన్మయి కృష్ణదాస్ పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను కూడా కొట్టివేసింది బంగ్లాదేశ్ కోర్టు. బెయిల్ ఇవ్వటానికి నో అంటోంది. ఇండియా పదే పదే చేసిన విజ్ణప్తులు, హిందూ సంఘాల డిమాండ్లను కూడా లెక్కచేయకుండా.. బంగ్లాదేశ్ బరితెగింపు చర్యలకు దిగుతోంది.

ఇస్కాన్ సంస్థ మాజీ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్ ను బంగ్లాదేశ్ కోర్టు తిరస్కరించింది. గురువారం బెయిల్ పిటిషన్ పై వాదనల నేపథ్యంలో చిట్టగాంగ్ లోని కోర్టు ముందు హాజరయ్యారు చిన్మయ్ కృష్ణదాస్. వాదనలు విన్న కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. అటు చిన్మయ్ బెయిల్ తిరస్కరణపై కోల్ కతా ఇస్కాన్ వైస్ ప్రసిడెంట్ రాధా మోహన్ దాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బెయిల్ వస్తుందని ఆశించామని కానీ బెయిల్ తిరస్కరణ నిరాశపర్చిందని అన్నారు. 42 రోజులుగా జైల్లో ఉంటున్నా ఇప్పటికీ బెయిల్ ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బంగ్లాదేశ్‌‌ ప్రభుత్వం కక్ష కట్టింది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసింది. దీంతో ఢాకాలోని ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో కృష్ణదాస్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి 42 రోజులుగా ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. అటు కృష్ణదాస్ ప్రభు అరెస్టుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది.