బీహార్ మంత్రివర్గ విస్తరణ: ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ సహా 31 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

Bihar Cabinet Expansion 31 Leaders Including RJD's Tejashwi Yadav Sworn in as New Ministers, Nitish Kumar Expands Cabinet Inducts 30 MLAs As Cabinet Ministers In Bihar, Nitish Kumar Inducts 30 MLAs As Cabinet Ministers In Bihar, Nitish Kumar Expands Cabinet, 30 MLAs As Cabinet Ministers, Bihar Cabinet Ministers, Bihar Cabinet, Bihar cabinet expansion, Bihar CM Nitish Kumar, CM Nitish Kumar, 30 MLAs, Bihar cabinet expansion News, Bihar cabinet expansion Latest News And Updates, Bihar cabinet expansion Live Updates, Mango News, Mango News Telugu,

బిహార్‌ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఈ మేరకు పాట్నాలోని రాజ్‌భవన్‌లో మంగళవారం కొత్త మంత్రులతో గవర్నర్‌ ఫగు చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ హాజరయ్యారు. కాగా నితీశ్‌ కేబినెట్‌లో తేజస్వికి చోటు దక్కడం ఇది రెండోసారి. ప్రమాణం చేసిన మంత్రుల్లో 16 మంది రాష్ట్ర అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీకి చెందిన వారు కాగా, 11 మంది నితీష్ కుమార్‌ నేతృత్వం లోని జేడీయుకి చెందిన వారు. మరో ఇద్దరు కాంగ్రెస్‌కు చెందినవారు.

వీరిలో ఆర్జేడీ నుంచి.. తేజస్వి యాదవ్‌, వీరేంద్ర, షానవాజ్, చంద్రశేఖర్, అనితా దేవి, అక్తరుల్ షాహీన్, అలోక్ మెహతా, లలిత్ యాదవ్, సురేంద్ర యాదవ్, రామానంద్ యాదవ్, సమీర్ మహాసేత్, సుధాకర్ సింగ్, సర్వజిత్ కుమార్, సురేంద్ర రామ్, భరత్ భూషణ్ మండల్.. జేడీయూ నుంచి విజయ్ చౌదరి, సంజయ్ ఝా, సునీల్ కుమార్, శ్రవణ్ కుమార్, బిజేంద్ర యాదవ్, అశోక్ చౌదరి, షీలా మండల్, జమా ఖాన్, లేషి సింగ్, జయంత్ రాజ్, మదన్ సాహ్ని.. కాంగ్రెస్‌ నుంచి అఫక్‌ ఆలం, మురారీ, ప్రసాద్‌ గౌతమ్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY