బీహార్‌లో రెండో దశ పోలింగ్.. సీఎం నితీశ్ కేబినెట్‌కి అసలైన పరీక్ష

Bihar Election 2025 Second Phase Voting Begins, 12 Ministers of CM Nitish Kumar's Cabinet Faces Test

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, రెండో దశ పోలింగ్ మంగళవారం (నవంబర్ 11, 2025) ఉదయం ప్రారంభమైంది. ఈ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రాష్ట్రంలోని మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 45 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

తేలనున్న మంత్రుల భవితవ్యం:

ఈ రెండో దశ పోలింగ్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేబినెట్‌కు చెందిన ఏకంగా 12 మంది మంత్రుల భవితవ్యం తేలనుంది. ఇది అధికార జేడీయూ-బీజేపీ కూటమికి అత్యంత కీలకమైన పరీక్షగా మారింది. కీలకమైన ఈ మంత్రులందరూ గెలుపొందడం అనేది నితీష్ కుమార్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం.

పోలింగ్ వివరాలు:

స్థానాలు: 20 జిల్లాల పరిధిలోని 122 అసెంబ్లీ స్థానాలు.

అభ్యర్థులు: మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ప్రాంతాలు: మధ్య, పశ్చిమ మరియు ఉత్తర బీహార్‌లోని ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో మిత్రపక్షాలకు, విపక్ష మహాఘట్‌బంధన్‌కు మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల తుది ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here