దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండడంతో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
“నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఇటీవల నన్ను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. సురక్షితంగా ఉండండి” అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. మరోవైపు గత 24 గంటల్లో కొత్తగా 2,55,874 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 25, మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,97,99,202 కు చేరుకుంది.
After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested. #StaySafe
— Gautam Gambhir (@GautamGambhir) January 25, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF