అగ్రవర్ణ పేద మహిళలకు భరోసా.. ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’

Andhra government to launch EBC Nestham scheme, AP CM YS Jagan Launches EBC Nestham, AP Government, AP Government To Be Launched EBC Nestham Scheme, AP Government To Be Launched EBC Nestham Scheme For Upper Cast Poor Women, AP YSR EBC Nestham Scheme, AP YSR EBC Nestham Scheme 2022, EBC Nestham Scheme, EBC Nestham Scheme 2022, EBC Nestham Scheme 2022 Eligibility, EBC Nestham Scheme For Upper Cast Poor Women, Mango News, Upper Cast Poor Women

అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల కోసం వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం మొదటి విడత పథకాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో.. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థికసాయం అందించనున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. నేరుగా మహిళల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. వర్చువల్ విధానంలో బటన్ నొక్కి మహిళ ఖాతలాల్లో 589 కోట్ల రూపాయల నగదు జమ చేశారు. ఏ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అగ్రవర్ణంలో ఉన్న పేదల ఇబ్బందులు కూడా గుర్తించామని సీఎం చెప్పారు.

అందుకే ఈ పథకం ద్వారా పేద మహిళలకు మేలుచేయాలన్న సత్సంకల్పంతో.. వారికి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఈ ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకం ప్రారంభించామని తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు 3,92,674 మంది పేద అక్క చెల్లెమ్మలకు రూ. 589 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నానని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 11 =