బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు షాక్

Byju's Raveendran Ordered to Pay Over 1 Billion Dollars by US Court Following Default Ruling

ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ (Byjus) కంపెనీ సహ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు అమెరికా కోర్టులో భారీ షాక్ తగిలింది. బైజూస్ ఆల్ఫా ట్రస్ట్ చెల్లించాల్సిన బాకీకి గాను అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జ్‌మెంట్‌ (డిఫాల్ట్ తీర్పు) వెలువరించింది. ఈ మేరకు ఆయన 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.

కాగా, బైజూస్ చెల్లింపులు చేయకపోవడంతో సమయానికి బాకీలు తీర్చలేదని కోర్టు పేర్కొంది. బైజూస్ ఆల్ఫా ట్రస్ట్ చేసిన రుణాలను చట్టం ప్రకారం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉందని కోర్టు తెలిపింది. సుమారు 1 బిలియన్ డాలర్ల బాకీని బైజూస్ ఆల్ఫా ట్రస్ట్ చెల్లించాల్సి ఉంది.

అయితే డీల్‌లో భాగంగా బైజూస్ చేసిన ఒప్పందాలను కోర్టు పరిశీలించింది. ఈ సందర్భంగా బైజూస్ ఆల్ఫా ట్రస్ట్ నుంచి గ్రూప్‌కు 593 మిలియన్ డాలర్లు అందినట్టు గుర్తించిన కోర్టు, ఈ మొత్తం తిరిగి చెల్లించలేదని తెలిపింది.

అమెరికన్ లెండర్లు పెట్టుబడులకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి. బైజూస్ ఆల్ఫా ట్రస్ట్ నుండి సుమారు 593 మిలియన్ డాలర్లు బైజూస్ కంపెనీలకు వెళ్లాయి. మొత్తం 540.6 మిలియన్ డాలర్ల బాకీని ఇంకా చెల్లించలేదని కోర్టు పేర్కొంది.

ఇక బైజూ రవీంద్రన్, ఆల్ఫా ట్రస్ట్ ఈ మొత్తాన్ని చెల్లించకపోవడం మరియు బైజూస్ వైపు నుండి ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వకపోవడంతో కోర్టు డిఫాల్ట్ తీర్పును ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం బైజూస్ సంస్థ మరియు బైజు రవీంద్రన్ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెల నవంబర్ 20న ఈ తీర్పు వెలువడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here