యూపీ ఎన్నికల ఫలితాలు: బీజేపీ-బీఎస్పీ మధ్య పొత్తు పుకార్లపై స్పందించిన మాయావతి

UP Assembly Elections 2022 Results Mayawati Responds Over Rumours of BSP-BJP Tie-Up, UP Assembly Elections 2022 Results, Mayawati Responds Over Rumours of BSP-BJP Tie-Up, Uttar Pradesh Assembly Election Results 2022 Live Updates, Poll Results of UP, Poll Results of UP 2022 Assembly Elections, Counting of Votes 2022 Assembly Elections Results Live Updates, Assembly Elections-2022, Uttar Pradesh Assembly Election Results 2022, Election 2022, Assembly Election, Assembly Election 2022, 2022 Assembly Election, Assembly Elections, Assembly Elections Latest News, Assembly Elections Latest Updates, Assembly Elections Live Updates, 2022 Assembly Elections, Assembly Elections, Elections, Mango News, Mango News Telugu,

ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. యూపీ ఎన్నికలలో బీఎస్పీ దారుణ ఓటమికి మీడియానే కారణం అని మాయావతి పేర్కొన్నారు. బీజేపీ-బీఎస్పీ మధ్య పొత్తు పుకార్లపై స్పందించిన మాయావతి అది కేవలం మీడియా క్రియేట్ చేసిన పుకారుగా కొట్టిపడేశారు. యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ, 1990లలో దళితుల రాజకీయ వేదికగా రూపాంతరం చెందింది. కాగా, మాయావతి ఇప్పటివరకు 4 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టటం విశేషం. అనంతర రాజకీయ పరిస్థితులలో రాష్ట్రంలో బీఎస్పీ అధికారం కోల్పోయింది.  అంతేకాకుండా పలు అవినీతి ఆరోపణలతో మాయావతి ప్రభ మసకబారింది.

2017లో అతి తక్కువగా 19 సీట్ల తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికలలో 403 మంది ఎమ్మెల్యేలతో కూడిన అసెంబ్లీలో బీఎస్పీ కేవలం ఒక్క సీటు రావడం ఆ పార్టీ పతనాన్ని తెలుపుతోంది. అయితే, 2009లో బీఎస్పీ లోక్‌సభలో 20 ఎంపీ సీట్లను గెలుచుకోవటం విశేషం. ప్రస్తుతం యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మరియు బీజేపీ అధికారంలో ఉంది. బిజెపి సహాయంతో మాయావతి సిఎం అయిన ప్రతిసారీ ఎంతో కొంత ప్రభావం పార్టీపై పడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 6 =