అమెరికాలోని ఒక మ్యూజిక్ కంపెనీ సీఈఓ బాల్డ్విన్ 99 మంది ఉద్యోగులను ఒకే రోజులో తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం 111 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థలో, సమావేశానికి హాజరుకాని 99 మందిని తొలగించారు. ఈ సంఘటనను ఓ బాధిత ఉద్యోగి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
99 మందికి షాక్, 11 మందికి మాత్రమే కొనసాగింపు
సీఈఓ బాల్డ్విన్ అభిప్రాయం ప్రకారం, సమావేశానికి హాజరుకాని వారు ఉద్యోగ నిబంధనలను పాటించలేదని,..”మీరు మీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోయారు. అందుకే మన మధ్య ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాం. సంస్థకు చెందిన వస్తువులు వెంటనే తిరిగి ఇవ్వండి, ఖాతాలన్నీ సైన్‌ఔట్ చేయండి,” అంటూ బాల్డ్విన్ అధికారిక నోటీసు పంపినట్లు సమాచారం. సమావేశానికి 110 మంది ఉద్యోగుల్లో కేవలం 11 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ విషయంపై స్పందించిన సీఈఓ, సమావేశానికి హాజరైన వారినే సంస్థలో కొనసాగిస్తామని ప్రకటించారు. మిగిలిన 99 మంది ఉద్యోగులను వెంటనే తొలగించారు.
సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ
ఈ నిర్ణయం నెటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది. “మీటింగ్ సమాచారం అందకపోవడం వల్లనే 99 మంది హాజరుకాలేదేమో,” అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు, “ఇది కేవలం ఆర్థిక సమస్యల వల్ల తీసుకున్న చర్యలా అనిపిస్తోంది,” అంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనకు ముందు, ప్రముఖ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఒక స్టార్టప్ సీఈఓ జూమ్ కాల్‌లో 900 మందిని తొలగించడంతో ఆ సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ ఘటన మేనేజ్‌మెంట్ తీరు, సంస్థల నిర్ణయాల గురించి కీలక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మీటింగ్‌కు హాజరుకాకపోవడం వల్ల 90 శాతం ఉద్యోగులను తొలగించడం అన్యాయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే, ఈ నిర్ణయానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.