
దేశంలో రోజురోజుకు రాజకీయాలకు అర్థం మారిపోతూ వస్తోంది. ఒకప్పుడు పార్టీ, సిద్ధాంతాలు, నిస్వార్థం అనే భావనతోనే నాయకులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయడానికి వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి సిద్ధాంతాలను గాలికి వదిలేసి కేవలం స్వప్రయోజనాల కోసమే కుటుంబ లబ్ధి కోసమే రాజకీయాల్లోకి వస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది .
ప్రజలకు సేవ చేయడం అనేది గాలికి వదిలేస్తూ ఆస్తులు కూడబెట్టుకోవడంలోనే ధ్యాస పెడుతున్నారు. స్వార్థం లేని నేతలు ఎక్కడా కనిపించడం లేదు. చివరకు ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద లీడర్ అన్నట్లుగా ప్రజాప్రతినిధుల మైండ్ సెట్ మారిపోతోంది. ఇక ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్లు , చేస్తున్నవాళ్లు కూడా వీటికి అతీతం కాదు. అందుకే చాలా మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి. అయితే వీరిలో టాప్ 5 ఎవరా అన్న చర్చ నడుస్తోంది.
ఎక్కువ కేసులు ఉన్న సీఎంలు..దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రులలో కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అయితే మాజీ సీఎం కేసీఆర్‌పై ఏకంగా 64 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి.క్రిమినల్ కేసులు ఎక్కువ ఉన్న ముఖ్యమంత్రులలో రెండో స్థానంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఉన్నారు. స్టాలిన్‌పై 47 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి.
క్రిమినల్ కేసులున్న సీఎంలలో మూడో స్థానంలో ఉన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇతనిపై 38 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.క్రిమినల్ కేసులు ఉన్న సీఎంలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే నాలుగవ స్థానంలో ఉన్నారు. ఏక్‌నాథ్‌షిండేపై 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి.క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రులలో 5వ స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఇతనిపై ఇప్పటి వరకూ 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY