నిరంతరం ఆరోపణలు, విమర్శలు చేసుకునే రాజకీయ ప్రత్యర్ధులు ఒకరి పట్ల ఒకరు అభిమానాన్ని, మద్దతును ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి సందర్భమే ఒకటి బుధవారం చోటుచేసుకుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురవగా, అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధానిని ఉద్దేశించి హిందీలో ఒక ట్వీట్ చేశారు. ‘తల్లి మరియు కొడుకు మధ్య ప్రేమ శాశ్వతమైనది మరియు వెలకట్టలేనిది. మోదీ జీ, ఈ కష్ట సమయంలో నా ప్రేమ మరియు మద్దతు మీకు ఉంటుంది. మీ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తద్వారా ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ బాసటగా నిలిచారు. కాగా ప్రస్తుతం హీరాబెన్ మోదీ యూఎన్ మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY







































