సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR Expressed Condolences on Demise of Noted Sanskrit Scholar Padmashri Sribhashyam Vijayasarathi,Cm Kcr Condoles Death Of Vijayasarathy,Renowned Sanskrit Language Scholar,Padma Shri Sribhashyam Vijayasarathy,Mango News,Mango News Telugu,Padma Shri Sridhar Vembu,Vijayasarathi Sribhashyam,Padma Shri Vidya Balan,Padma Shri Salary,Sanskrit Language Sanskrit Varnamala,Sribhashyam Vijayasarathi,Sanskrit Language In Malayalam,Sanskrit Language Script,Sanskrit Language Benefits,Sribhashyam Book,Sribhashyam Tamil,Sribhashyam Appalacharyulu

సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, కరీంనగర్ కు చెందిన, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. శ్రీభాష్యం విజయసారథి మరణం దేశ సంస్కృత భాషా పాండిత్యానికి తీరని లోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా శ్రీభాష్యం సాహితీ సేవను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కవిత్వ సృజనతో పాటు, రాగయుక్తంగా కవిత్వాలాపన చేయడంలో శ్రీభాష్యం గొప్ప ప్రతిభను ప్రదర్శించేవారని, వర్తమాన కవులకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. శ్రీభాష్యం విజయసారథి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గత కొన్నిరోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీభాష్యం విజయసారథి, పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారు జామున ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సంస్కృతం, సాహిత్యం మరియు విద్యా రంగంలో ఆయన సేవలకు గానూ 2020లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుతో శ్రీభాష్యం విజయసారథిని సత్కరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 9 =