దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. గత కొన్ని రోజులుగా కొంత హెచ్చు, తగ్గులతో 500-2500 మధ్యనే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 862 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 25, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,44,938 కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో ముగ్గురు మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,28,980 కి పెరిగింది.
దేశంలో 22,549 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.76 శాతం:
దేశంలో ప్రస్తుతం 22,549 (0.05%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 1,503 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,40,93,409 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇక అక్టోబర్ 24, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 90.01 (90,01,49,497) కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో 63,786 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY