రెండో వేవ్ కరోనా ప్రభావంతో ఫ్రాన్స్ లో మరోసారి లాక్‌డౌన్

Corona Second Wave Effect, Coronavirus, Coronavirus In France, coronavirus news, Coronavirus second wave, Coronavirus second wave news, Coronavirus Updates, COVID-19 News, European health boss warns of virus second wave, France Coronavirus Lockdown, France Coronavirus Lockdown News, French Government, Once Again Lockdown Across the France

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్రాన్స్ తో పాటుగా మరికొన్ని దేశాల్లో రెండో వేవ్ కరోనా వైరస్ సంక్రమణ మొదలైంది. ఈ నేపథ్యంలో రెండో వేవ్ తీవ్రత మరింత ఎక్కువుగా ఉండడంతో ప్రాన్స్ మరోసారి లాక్‌డౌన్ బాట పట్టింది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశవ్యాప్తంగా పాటించాల్సిన కొత్త లాక్‌డౌన్ నిబంధనలను ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ లో కూడా గత లాక్‌డౌన్ మాదిరిగానే ఫ్రాన్స్‌లోని ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ఒక ఫారమ్‌ను పూర్తిచేసి రాతపూర్వక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే డిసెంబర్ 1 వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని చెప్పారు.

కరోనా కేసులను గమనిస్తూ, ప్రతి 15 రోజులకు ఓసారి కొత్త నిబంధనలపై ప్రకటన చేయనున్నట్టు పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో వైరస్ యొక్క పరిణామం నిరాశావాదుల అంచనాలను కూడా అధిగమించిందని మాక్రాన్ అన్నారు. గత రెండువారాల్లో విధించిన కర్ఫ్యూ, నిబంధనలు రెండో వేవ్ ను ఎదుర్కోవడానికి సరిపోలేదని తెలిపారు. అన్ని అంతర్జాతీయ సరిహద్దులు మూసివేయబడతాయని, దేశంలోకి ఎవరూ ప్రవేశించిన తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త లాక్‌డౌన్ నిబంధనలలో పాఠశాలలు మాత్రం తెరిచి ఉంటాయని ప్రకటించారు. మరోవైపు ఫ్రాన్స్ లో ఇప్పటికి కరోనా పాజిటివ్ కేసులు 13,27,853 కు చేరుకోగా, 36 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu