భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18,177 పాజిటివ్ కేసులు, 217 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 1,03,23,965 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,49,435 కి పెరిగింది. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ లో, ఆసుపత్రుల్లో 2,47,220 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 20,923 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 99,27,310 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 96.16 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జనవరి 3, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 17,48,99,783
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,03,23,965
- కొత్తగా నమోదైన కేసులు [జనవరి 2–జనవరి 3 (8AM-8AM)] : 18177
- నమోదైన మరణాలు : 217
- రికవరీ అయిన వారి సంఖ్య : 99,27,310
- యాక్టీవ్ కేసులు : 2,47,220
- మొత్తం మరణాల సంఖ్య : 1,49,435
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ