కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాలివే…

Covid-19 in India: List of 5 States which have Highest Number of Positive Cases and Deaths

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 1, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల 94,31,691 కు, మరణాల సంఖ్య 1,37,139 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 10 లక్షల పైగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో కరోనా పరీక్షల నిర్వహణ కూడా 14 కోట్లు (14,03,79,976) దాటింది. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలు:

  • మహారాష్ట్ర – 18,23,896
  • కర్ణాటక – 8,84,897
  • ఆంధ్రప్రదేశ్ – 8,68,064
  • తమిళనాడు – 7,81,915
  • కేరళ – 6,02,983

దేశంలో కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలు:

  • మహారాష్ట్ర – 47,151
  • కర్ణాటక – 11,778
  • తమిళనాడు – 11,712
  • ఢిల్లీ – 9,174
  • పశ్చిమబెంగాల్ – 8,424
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ