దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంపై కరోనా వైరస్ అధిక ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 15 లక్షలు దాటింది. అక్టోబర్ 13, మంగళవారం నాడు కూడా 8522 కరోనా కేసులు, 187 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,43,837 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 40,701 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 15,356 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 12,97,252 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 84.03 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.64 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,05,415 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు మంగళవారం నాటికీ మహారాష్ట్రలో 77,62,005 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu