దేశవ్యాప్తంగా మళ్లీ మారిన రూల్

Daughters Do Not Get A Share Of The Property In These Cases ,Daughters Do Not Get A Share Of The Property, Right To Property, The Rule Of Women'S Right,Property Rights Of Daughter,Daughter In Law In India,Daughters Inheritance Rights,Daughters Rights In Father'S Property,Propertydistribution,Legalrights,Inheritancelaws,Mango News, Mango News Telugu
Right to property,Daughters do not get a share of the property, The rule of women's right,

మనుషుల అవసరాలు, ఆ అవసరాలను బట్టి కాలంతో పాటు చట్టంలోని  నియమాలు  మారుతూ ఉంటాయని ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇందులో భాగంగానే స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని హక్కులు పొందే చట్టం..ముఖ్యంగా ఆస్తిలో హక్కు చట్టం కూడా వచ్చింది. అయితే మహిళలకు పురుషులతో సమానంగా అన్ని సందర్భాలలోనూ ఆస్తిలో భాగం పంచుకునే హక్కు ఉండకపోవచ్చు. ఆస్తిలో మహిళకి సమాన వాటా ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నా  కూడా కొన్ని ప్రత్యేక కారణాలను పేర్కొంటూ ఆమెకు ఆస్తిలో వాటాపై హక్కు లేదని చెప్పొచ్చు.

సామాజికంగా, ఆర్ధిక పరంగానే కూడా  అన్ని రంగాల్లో మహిళలకు సమాన హోదా కల్పించడానికి సమాజం ప్రయత్నిస్తోంది. అందులో ముఖ్యమైన ఆస్తి విషయానికి వస్తే.. 2005లో హిందూ వారసత్వ చట్టం ప్రకారం స్త్రీలకు  ఆస్తిలో  సమాన వాటా కల్పించాలనే నిబంధన అమలులోకి వచ్చినా కూడా.. కొన్ని సందర్భాల్లో మాత్రం  మహిళలు సమాన హక్కుకు అనర్హులుగా పరిగణించాలి.

ఎక్కడైనా ,  ఎప్పుడయినా తండ్రి స్వంత ఆస్తి దారుడు అయితే ఆ ఆస్తిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఇవ్వాలనే  పూర్తిగా తండ్రి నిర్ణయం. మగ పిల్లలు అయినా ఆడపిల్లలు అయినా అందులో భాగం అడిగే అధికారం  ఎవరికీ కచ్చితంగా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ తండ్రి  అది అతని స్వతంత్ర ఆస్తి అయితే అతను బతికి ఉన్నంతకాలం, ఆ ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు, కుమార్తెలకు ఉండదు. తండ్రి తన సొంత ఆస్తి గురించి కూతుళ్ల ప్రస్తావన లేకుండా  వీలునామా రాసినా, లేదా ఆ ఆస్తిని ఎవరికైనా విక్రయించినా,లేదా కొడుకులకు, బంధువులకు బహుమతిగా ఇచ్చినా, అలాంటి ఆస్తిలో మాత్రం కుమార్తెలకు వాటా ఉండదు.

ఒకవేళ 2005లో హిందూ వారసత్వ చట్టం రాక ముందే తండ్రి తన  ఆస్తిని పంచి ఉంటే, దానిని మరొకరు అనుభవిస్తుంటే తిరిగి ఇవ్వమని అడిగే హక్కు  కుమార్తెలకు లేదని చెప్పొచ్చు.  అలాగే ముందుగా భూమి తమకు వద్దు అని చెప్పి,అన్నదమ్ములు వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న సమయంలో.. కొన్నాళ్ల తర్వాత ఆ భూమికి మంచి ధర ఇమ్మని అడగడం చేయకూడదు.  ఎందుకంటే మీ అన్నదమ్ములు ఆ ఒక్క చోటను నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ ఆస్తిని అమ్మాలంటే అది వాళ్లకు  ఇబ్బందిగా ఉంటుంది.

అలాగే తండ్రి చనిపోయాక ఆస్తి పంపకాలు జరిగే సమయంలో తమ వాటా విషయంలో, తనకు ఆస్తి వద్దని.. డబ్బులు కావాలని అంగీకరిస్తూ హక్కు విడుదల పేపరుపై సంతకం చేస్తే..ఆ తర్వాత మళ్లీ  ఆస్తిలో వాటాను అడిగే హక్కు మహిళలలకు ఉండదు. అయితే  ఆస్తి వాటాలో తోబుట్టువుల సంతకాన్ని కాపీ చేసి, కోరుకున్న వాటాను ఇవ్వకపోతే, వాటాను పొందడానికి మాత్రం న్యాయ స్థానాన్ని ఆశ్రయించొచ్చు. అలాగే తప్పుడు పత్రం సృష్టించి సోదరులు ఆస్తి జప్తు చేస్తే న్యాయపరంగా మహిళలు ఆస్తిలో వాటా పొందవచ్చు. ఒకవేళ పూర్వీకులు రక్తసంబంధీకులకు కాకుండా వేరే ఎవరికైనా ఆస్తిని బహుమతిగా ఇస్తే.., దానిని బహుమతిగా స్వీకరించిన రికార్డు కూడా ఉంటే, ఆ ఆస్తిని తిరిగి పొందే హక్కు ..కుటుంబీకులకు కూడా  ఉండదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ