జనవరి 13న మొదలైన ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతోన్న మహాకుంభమేళకు రోజురోజుకు రద్దీ పెరుగుుతుంది.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ.. సాధువులు, అఘోరాలు, విదేశీ భక్తులు ఇలా ప్రపంచం నలుమూలల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు తరలివస్తున్నారు. ఇప్పటికే 12 కోట్లకు మంది వరకూ పుణ్య స్నానాలు ఆచరించగా మౌని అమావాస్య రోజయిన జనవరి 29న ఏకంగా 10 కోట్ల మంది వరకూ స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
విభుడు, దేవాదిదేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే మహా కుంభమేళగా పెద్దలు అభివర్ణిస్తారు కాబట్టి.. ఈ 45 రోజుల్లో ఒక రోజయినా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే రికార్డు స్థాయిలో పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు.అయితే జనవరి 29 బుధవారం మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన సుదినంగా పండితులు చెబుతున్నారు.
మౌని అమావాస్య రోజును అద్వితీయమైన రోజుగా పండితులు భావిస్తున్నారు. మహాకుంభ మేళాలో స్నానమాచరించడమే ఎంతో పుణ్యం అటువంటిది మాఘ మాస మౌని అమావాస్య కలిసొచ్చిన వేళ.. గంగా స్నానం చేస్తే మరెంతో పుణ్యం అని పండితులు చెబుతున్నారు. మౌని అమావాస్య రోజున చేసే స్నానాలను షాహి స్నాన్ అంటారని.. ఆరోజు పుణ్యస్నానం ఆచరించి తోచినంత.. దానాలు చేస్తే జన్మ ధన్యం అవుతుందని అంటున్నారు.
నిజానికి మౌని అమావాస్య ధ్యానానికి, జ్ఞానానికి చిహ్నంగా పండితులు చెబుతారు. ఆరోజంతా మౌనంగా వుంటూ ..పరమేశ్వుడిని ధ్యానంలోనే గడుపుతూ.. పవిత్ర గంగా స్నానంచేసి పితృదేవుళ్లకు నీరాజనాలు అర్పిస్తారు. దీని ద్వారా పూర్వీకులకు సద్గతులు కలగడంతో పాటు అందరికీ సకల శుభాలు కలుగుతాయని అంటారు. మహాకుంభమేళానే ఎంతో మహిమాన్వితం అని అయితే ఈసారి మౌని అమావాస్య కూడా కలిసిరావడం మరెంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
ఇప్పటికే మహా కుంభ మేళాలకు కోట్లలో తరలి వస్తున్న భక్తులు పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు. మాఘ మాస మౌన అమావాస్యయిన జనవరి 29న ఒక్కరోజే పది కోట్లకు మంచి భక్తులు తరలి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది. మౌన అమావాస్య కోసం భారత రైల్వే శాఖ ఏకంగా 150 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎవరికి ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా యూపీ సర్కార్ పకడ్బందీ ఏర్పాట్లను చేసింది.కాగా ఈసారి ప్రయాగ్ రాజ్‌లో యూత్ ఎక్కువగా కనిపించడంతో యువతరంగాల జోరు వెల్లి విరుస్తోందన్నట్లుగా ఉంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగ సాధువులు, పెద్దవాళ్లకు సమానంగా యువత కన్పిస్తున్నారు.